వారం వారం గోచారం

వారం వారం గోచారం (10-6-2018 నుంచి 16-6-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమవారాల్లో ఆలోచనలు విస్తరిస్తాయి. కొత్త కార్యక్రమాల నిర్వహణలో తలమునకలవుతారు. సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. విజయసాధన. సంతోషం. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. మంగళ బుధవారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో ఆచితూచి ప్రవర్తించాలి. తొందరపాటు కూడదు. నిల్వధనం తగ్గే సూచనలు. ఊహించని సంఘటనలు. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి. గురు శుక్రవారాల్లో వ్యాపారాత్మక ప్రయాణాలకు అవకాశం. సంప్రదింపులు ఉంటాయి. ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. ధర్మ కార్యక్రమాల్లో ఉన్నతి. శనివారంనాడు సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమవారాల్లో ఖర్చులు, పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోవచ్చు. జాగ్రత్త. వ్యతిరేక ప్రభావాలు పెరిగే అవకాశం. తొందరపాటు కూడదు. శత్రువులపై విజయం. రుణాలు తీర్చుతారు. మంగళ బుధవారాల్లో నిర్ణయాదులకు అనుకూలత. కార్యనిర్వహణలో ఆత్మవిశ్వాసం. కొత్త పనులపై దృష్టి. సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి. పరిచయాలు, అనుబంధాల్లో సమస్యలుంటాయి. గురు శుక్రవారాల్లో ఆర్థిక నిల్వలపై దృష్టి. మాటల్లో చమత్కారం. కొంత అధికారిక ధోరణి. అనుకోని సంఘటనలు. ఆకస్మిక ఇబ్బందులు. నిర్ణయాల వాయిదా మంచిది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమవారాల్లో లాభాలు శ్రమకు గురి చేస్తాయి. కొన్ని ప్రయోజనాలు ఆశించకుంటే మంచిది. పెద్దల ఆశీస్సులను అందుకోవాలి. మనోల్లాసం. సంతానంతో అనుకూలత. ఆలోచనలు ఫలిస్తాయి. మంగళ బుధవారాల్లో ఖర్చులు సంతృప్తినిస్తాయి. వ్యాపారాదుల్లో పెట్టుబడులకు అనుకూలం. విందులు వినోదాలు పార్టీలుంటాయి. పోటీ రంగంలో సమస్యలు. వ్యతిరేకతలు ఎక్కువ. గురు శుక్రవారాల్లో నిర్ణయాదుల్లో స్పష్టత. కార్యనిర్వహణ దక్షత. సంతోషంగా గడుపుతారు. కొత్త పనులను చేస్తారు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులున్నా అనుకూలత. అభీష్టాలు నెరవేరుతాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో సంతోషం. శనివారంనాడు ఆహార విహారాలు సమయానికి లభించకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమతో గౌరవం లభిస్తుంది. అధికారిక వ్యవహారాలపై దృష్టి. అధికారుల ఆదరణ. పితృవర్గ బంధువుల వ్యవహారాలు. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేయవచ్చు. శ్రమాధిక్యం. మంగళ బుధవారాల్లో లాభాలు ఆశించకుండా పని చేయాలి. ప్రయోజనాలు కొన్ని ఉన్నా శ్రమ అధికం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతృప్తి. గురు శుక్రవారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికం. వ్యర్థంగా వ్యాపారాదుల్లో నష్టాలు. కాలం కోల్పోయే అవకాశం. వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీల్లో విజయానికై ప్రయత్నం. శనివారంనాడు నిర్ణయాదుల్లో అనుకూలత.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమవారాల్లో ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. సంతృప్తి. ఆధ్యాత్మిక, ధార్మిక ప్రయాణాలు, కార్యక్రమాలు. సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకారం ఇవ్వడం మంచిది. మంగళ బుధవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. ముందు జాగ్రత్తలు అవసరం. సౌకర్యాలు విస్తరిస్తాయి. సౌఖ్యంగా గడుపుతారు. ఇల్లు, వాహనం, ఆహారాదులపై దృష్టి ఉంటుంది. గురు శుక్రవారాల్లో లాభాలు శ్రమకు గురి చేయవచ్చు. ప్రయోజనాల విషయంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. సంతాన వ్యవహారాలపై దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. శనివారంనాడు ఖర్చులు, పెట్టుబడులు అధికం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమవారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సంఘటనలు. అనారోగ్య భావనలు. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. నిల్వధనం జాగ్రత్తగా చూసుకుంటారు. మాటల్లో చమత్కారం. మంగళ బుధవారాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాలు, ప్రయాణాలు. అత్యున్నత విద్యలపై దృష్టి, కీర్తి ప్రతిష్ఠలకు అనుకూలం. సంప్రదింపుల్లో ఒత్తిడులు. సహకార లోపాలకు అవకాశం. సోదరవర్గంతో ఒత్తిడులు. గురు శుక్రవారాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారుల ఆదరణ. పదోన్నతులు, గుర్తింపు. ఆహార విహారాల్లో సర్దుబాటు అవసరం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమవారాల్లో పరిచయాలు అనుబంధాలు విస్తరించే అవకాశం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతోషంగా గడపడానికి ప్రయత్నం. శ్రమాధిక్యం. నిర్ణయాదుల్లో అనుకూలత. కార్యనిర్వహణపై దృష్టి. మంగళ బుధవారాల్లో అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. శ్రమలేని లాభాలపై దృష్టి. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. గురు శుక్రవారాల్లో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యాపారాదులకై దూర ప్రయాణాలు. విజ్ఞానయాత్రలకు అవకాశం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. పెద్దల వల్ల ఒత్తిడులు ఏర్పడవచ్చు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమవారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నం. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థం కావచ్చు. వినోద విహారాదుల కోసం వ్యయం. మంగళ బుధవారాల్లో వైవాహిక, వ్యాపార భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. దూర ప్రయాణావకాశాలు. సంతోషంగా గడిపినా శ్రమ తప్పకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు. ఊహించని సంఘటనలు. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమవారాల్లో కుటుంబ మనోభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలు. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాత్మక వ్యవహారాలు. లాభాలపై దృష్టి వద్దు. ఎదుటివారికి మేలు కలిగే పనులు చేయాలి. మంగళ బుధవారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు, ఒత్తిడులు ఇబ్బందులకు గురి చేయవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శత్రు రోగ రుణాల వృద్ధి. జాగ్రత్త. గుర్తింపు కోల్పోవచ్చు. ఖర్చులు పెట్టుబడులు అధికం. విహారాలుంటాయి. గురు శుక్ర వారాల్లో వ్యాపార పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్యాల్లో సమస్యలు. స్నేహానుబంధాల్లో కూడా ఒత్తిడులుంటాయి. నిర్ణయాదుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమవారాల్లో ఇల్లు, వాహనం, ఆహార విహారాలు అధికంగా ప్రభావితం చేస్తాయి. సౌఖ్యం, సౌకర్యాలపై దృష్టి పెడతారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత. గుర్తింపు, గౌరవాదులుంటాయి. మంగళ బుధవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో చక్కగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం. గురు శుక్రవారాల్లో పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. రోగ రుణాలను అధిగమిస్తారు. ఖర్చులు, పెట్టుబడులు, ప్రయాణాదుల్లో జాగ్రత్త. విందులు వినోదాలు విహారాల్లో సమస్యలుంటాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమవారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త. సోదరవర్గ ఒత్తిడులు అధికం. దగ్గరి ప్రయాణాలుంటాయి. శ్రమాధిక్యం. సహకారం అందించాలి. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. మంగళ బుధవారాల్లో సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. శ్రమ ఉన్నా ఆహార విహారాల్లో సౌఖ్యం లభిస్తుంది. విద్యారంగంపై దృష్టి. వృత్తిలో ఒత్తిడులు. అధికారుల వల్ల సమస్యలు. గౌరవ లోపాలు. గురు శుక్రవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషంగా గడుపుతారు. సంతానవర్గ సంతృప్తి. ఏకాగ్రత, సృజనాత్మక శక్తి పెంచుకుంటారు. ప్రయోజన లోపాలుంటాయి. లాభాలపై దృష్టి పెట్టకూడదు. శనివారంనాడు వ్యతిరేక ప్రభావాలు అధికం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమవారాల్లో కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. కాలం ధనం సద్వినియోగం అవుతాయి. అనుకోని సంఘటనలు జరుగుతాయి. అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. మంగళ బుధవారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార, సమాచార లోపాలకు అవకాశం. సోదర వర్గ ఒత్తిడులు. దూర ప్రయాణాల్లో సంతృప్తి. ఆధ్యాత్మిక వ్యవహారాలు. కీర్తిప్రతిష్ఠలు, ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. గురు శుక్రవారాల్లో సౌకర్యాలు కొంత ఒత్తిడులకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ