రాష్ట్రీయం

ప్రభుత్వానికి , పార్టీకి మధ్య వారధిగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

7వేలమంది కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
వారాంతాల్లో ప్రజాసేవే మంత్రులకూ మినహాయింపులేదు

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోరారు. ఏడువేల మంది కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వరద బీభత్సానికి అతలాకుతలమైన నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కార్యకర్తలు , నాయకులు సహాయ పునరావాస చర్యల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. విపత్తుల్లో ప్రజలకు అండగా ఉండి వారిలో భరోసా కల్పించడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా పార్టీపరంగా కూడా మంచి పేరు వస్తుందని అన్నారు.
ఇతర జిల్లాల్లోని శ్రేణులు అంతా జన చైతన్య యాత్రల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు. గ్రామస్థాయి కార్యకర్త నుండి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు, పోలిట్‌బ్యూరో సభ్యులు అంతా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని అన్నారు. వృద్ధాప్య పెన్షన్లు ఐదు రెట్లు పెంచామని, వికలాంగుల పెన్షన్లు మూడు రెట్లు పెంచామని, రేషన్ బియ్యం కోటా 4 కిలోల నుండి ఐదు కిలోలకు పెంచామని, రైతుల రుణ ఉపశమనం , మహిళలకు మూలనిధి సహాయం , పారిశ్రామికీకరణ ద్వారా యువత ఉపాధి కల్పనకు చర్యలు, నదుల అనుసంథానం, విపత్తు సాయం పెంపుదల, ఈ పాస్ ద్వారా అవినీతిలేని పారదర్శక పంపిణీ, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం తదితర కార్యక్రమాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరును పర్యవేక్షించాలని పార్టీశ్రేణులను సూచించారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
స్మార్టు విలేజీ-స్మార్టు వార్డు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడమే గాక, ఎన్నారైలు, ఎన్నార్వీలు అందులో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పార్టీ నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సుశిక్షితులు కావాలని అన్నారు. జన చైతన్య యాత్ర జరుగుతున్న తీరు, అందులో నాయకులు, కార్యకర్తల ప్రాతినిధ్యం పరిశీలించి గ్రేడింగ్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు అంతా వారాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, కేంద్ర మంత్రులకు కడూ ఇందులో మినహాయింపు లేదని స్పష్టం చేశారు.