రాష్ట్రీయం

వంద కోట్లు ఏ మూలకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ అభివృద్ధి అవసరాలు తీరవు
మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్టే 5వేల కోట్లు
స్మార్ట్‌సిటీగా కరీంనగర్‌ను చేర్చాలి
కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 17: దేశంలో కెల్లా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తగినంత ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల పథకంలో హైదరాబాద్ నగరాన్ని కూడా చేర్చి ఏడాదికి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల నగరంలో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌సిటీల జాబితాలో హైదరాబాద్‌ను ఎంపిక చేయడానికి నగరానికి బదులుగా నగరానికున్న అవసరాలను గుర్తించి,ప్రత్యేకంగా పరిగణించి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు గురువారం ముఖ్యమంత్రి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 2011లో నియమించిన డాక్టర్ ఐషర్ జడ్జ్ అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్‌లో కీలక రంగాల్లో రూ. 30,370 కోట్లు అవసరమని, ప్రతీ ఏటా యాజమాన్య, నిర్వహణ ఖర్చుల కింద రూ. 1264 కోట్లు అవసరమని పేర్కొన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేవలం నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి, మురికి నీటి కాలువల నిర్మాణం, నిర్వహణకు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.స్ట్రాటిజిక్ రోడ్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిసి) ద్వారా సిగ్నల్ ఫ్రీ కారిడార్ల ఏర్పాటు కోసం రహదారుల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులకు రూ.20,661 కోట్లు కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల హైదరాబాద్ అవసరాలు తీర్చడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ రూ.5,500 కోట్లు ఉండగా, వంద కోట్ల రూపాయాలు ఏ మూలకు సరిపోతాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇంత తక్కువ మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల చెప్పుకోదగిన పనులేవి చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వంటి ఎ-1 నగరాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మంచినీటి సరఫరా, డ్రైనేజి, రవాణా తదితర వౌలిక రంగాల కోసం ప్రత్యేక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పై విషయాలను దృష్టిలో పెట్టుకుని స్వార్ట్‌సిటీల జాబితాలో హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్ నగరాన్ని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి తన లేఖలో కోరారు. దాదాపు మూడు లక్షల జనాభా కలిగిన కరీంనగర్ భౌగోళికంగా ఉత్తర తెలంగాణ నడిమధ్య ఉందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ పట్టణం త్వరలోనే ద్వితీయశ్రేణి నగర జాబితాలో చేరబోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ పథకంలో కరీంనగర్‌ను చేర్చడం వల్ల ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తన లేఖలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.