రాష్ట్రీయం

తిరుమలలో ఘనంగా వనభోజన మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 6: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం తిరుమలలోని పార్వేటి మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు టిటిడి రద్దు చేసింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీమలయప్ప స్వామివారికి బంగారు తిరుచ్చిపై దేవేరులు పల్లకిపై అందంగా అలంకరించి వాహన మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 9.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్ప స్వామివారిని చిన్న గజవాహనంపై వాహన మండపం నుంచి పార్వేటి మండపానికి తీసుకువచ్చారు.
మరో పల్లకిపై ఉభయ నాంచారులను కూడా ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఇక్కడ దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్వేటి మండపంలో మధ్యాహ్నం 1 గంట నుంచి మూడు గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. ఈకార్యక్రమంలో టిటిడి బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఒ సాంబశివరావు, సభ్యులు అనంత్, రమణ, శేఖర్, ఆలయ డిప్యూటీ ఇఒ చిన్నంగారి రమణ, కల్యాణకట్ట డిప్యూటి ఇఒ బేబిసరోజిని, అన్నప్రసాదం డిప్యూటీ ఇఒ వేణుగోపాల్, రిసెప్షన్ డిప్యూటీ ఇఒ కోదండరామారావు, ఇతర ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.