AADIVAVRAM - Others

దక్షిణాన గొయ్యతో చిక్కులు (వాస్తు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణరావు (శ్రీకాకుళం)
ప్రశ్న: మా ఇంటికి దక్షిణ భాగంలో పెద్ద గొయ్యి ఉన్నది. అలా ఉండకూడదు అని చాలామంది అంటున్నారు. కానీ ఆ గొయ్యిని ఏమీ చేయలేని పరిస్థితి.
జ: దక్షిణ/ పడమరలలో గోతులు ఉండరాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు గొయ్యిని పూడ్చలేరు కాబట్టి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
సురేష్ (సికిందరాబాద్)
ప్రశ్న: ఇటీవల ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్నాం. కానీ దానికి ఆగ్నేయ మూలలో మెట్లు దిగుతున్నట్లుగా ఉన్నాయి. దీనివల్ల ఏమైనా చెడు జరుగుతుందా?
జ: ఆగ్నేయ మూలలో దిగుతున్న మెట్లు వున్నట్లయితే ఇంట్లో వుండే ఆడవారికి అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు ఇంకా చాలా ఉంటాయి. దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
నాగరాజు (కడవకుదులూరు)
ప్రశ్న: పడమర నైరుతి వీధి పోటు ఉన్న స్థలం కొనాలని అనుకుంటున్నాము. ఎందువలన అంటే ధర చాలా తక్కువగా వస్తున్నది. అందువల్ల కొనాలనుకుంటున్నాం. అటువంటి స్థలం కొనవచ్చునా?
జ: పడమర నైరుతి వీధి పోటు గల స్థలం కొనకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ స్థలాన్ని మీరు కొనుగోలు చేయవద్దు.
ప్రభాస్ (తాండూరు)
ప్రశ్న: దిక్కులు తిరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చా? మా ఇంటి స్థలానికి తూర్పు రోడ్డు అనుకుంటే అది ఆగ్నేయంగల రోడ్డుగా వస్తున్నది. అలా వుండవచ్చా? అసలు ఇంటి నిర్మాణం చేయవచ్చా?
జ: దిక్కులు తిరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేయరాదు. అసలు ఆగ్నేయం రోడ్డుగా గల స్థలంలో నిర్మాణం చేయడం వలన ఇంట్లో వుండే ఆడవారికి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి నిర్మాణం చేయరాదు.
రాజేష్ (పాలకొల్లు)
ప్రశ్న: మా తాతల కాలంనాటి ఇంట్లో నివసిస్తున్నాము. చాలా పాతది. అందుకని ఆ ఇంటిని కూల్చివేసి నూతన గృహ నిర్మాణం చేయాలను కుంటున్నాం. దీనికి సంబంధించి పాత ఇంటిని కూల్చివేసేటప్పుడు ఏమైనా పద్ధతులు ఉన్నాయా?
జ: పాత ఇంటిని కూల్చి వేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటించాలి. అలాగే నూతన గృహ నిర్మాణం కోసం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది.
బాలు (వరంగల్)
ప్రశ్న: మేము ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మేము ఏమైనా తప్పులు చేశామా అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి పరిష్కారం?
జ: మీరు పంపిన ప్లాన్ ప్రకారం నైరుతి దోషాలు అధికంగా ఉన్నాయి. అలాగే స్థల దోషాల వలన కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి దోష నివారణ చేయించుకోండి.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28