వీరాజీయం

నెత్తిమీద.. నేలమీద మంటలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజవాడకి ‘బ్లేజ్‌వాడ’ అన్నమాట కూడా దక్కలేదు- పోనీ, మావూరి రైల్వే స్టేషన్‌కి ‘శుభ్రంగా ఉంటోంది’ అన్న నెంబర్‌వన్ ర్యాంకు కూడా లభించలేదు. నెంబర్ ఫోర్‌ట! బందరు, బాపట్ల కూడా భగభగ మండి బ్లేజ్‌వాడలైపోతే ఇంకేం చెయ్యాలి? అంటూ వాపోయాడో దుర్గా నాగేశ్వరరావు- రసం జుర్రి మామిడి టెంక కూడా మొత్తం ఖతమ్ చేసేసి, దాన్ని బస్సు క్రిందకి విసరేసి- గుంటూరుకి పెదకారు (బస్సు) ఎక్కేశాడు. కొన్నాళ్ళకి విజయవాడ కాస్తా ‘అమరావతి రోడ్ స్టేషన్’ అయిపోద్దేమో? నర్సీపట్నం రోడ్డు.. శ్రీకాకుళం రోడ్డు.. అన్నట్లు- ‘బందరు టెంపరేచరు ఎంతో తె లుసా?’ అడిగాడు గుంటూరాయన చెమటకి తడిసి ముద్దయి వొంటికి అంటుకుపోయిన చొక్కాని దూరంగా లాక్కొని గాలి పోసుకుంటూ. ‘ఇన్నాం.. నలభై ఏడూ పాయింట్ మూడు సెంటిగ్రేడులంట? అదే నే చెప్పేది..’ అన్నాడు ఎదుటి టర్కీ టవలు తలమీద కప్పుకున్న మోతుబరి.
డ్రైవరు బస్సు ఎక్కుతూ ‘నా సీటు నిప్పుల పొయ్యిలాగుంది..’ అంటూ హార్న్ కొట్టాడు. నిమ్మకాయ సోడాగాళ్ళు ఇంకా కొట్టుకాడే వేలాడుతూ వుంటే- రమ్మని పిలుపు అన్నమాట అది. ‘ఇది విను’ అన్నాడు బస్సెక్కుతున్న ఆసామి- బాపట్ల, బందరుని నెట్టి అవతల పారనూకింది.. అక్కడ అగ్గి కురుస్తుంది.. నలభై ఏడూ పాయింట్ నాల్గు..’’ అన్నాడు. అతని ముక్కుపుటాల వెంబడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పొగలు సెగలు వస్తున్నాయి.. ‘‘ఇట్లా గూబ గుయ్యమనిపించే గాడ్పు ఇంకేడనయిన ఉంటదంటావా?’’.
ఆడకూడా గాడ్పు ఈడ్చికొడతాదింట.. చిన్న కారేసుకుని మావోడు బంజారాహిల్స్ కాన్నించి వచ్చిండు. ఇలా ఎక్కడ చూసినా ఎండల మంటల కబుర్లే. పగటెండా, రాత్రి ఎండగా వున్నది కాలం. అన్ని పట్టణాలు, పల్లెలు అలాగే నిప్పులు చెరుగుతున్నాయి. పగటికి రాత్రికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం మూడో నాలుగో ఉండాలి. అలా కాదు ఇప్పుడు ఏడెనిమిది కొన్ని చోట్ల పది డిగ్రీల వ్యత్యాసం ఉండడంతో కుక్కలు కూడా కుంయ్ కంయ్ అనటం లేదు. ముఖాన మంచి ముత్యాలై మెరుస్తున్న స్వేద బిందువుల్ని కొంగుతో వొత్తుకుంటూ ఇలాగ అయితే సముద్రంలో దూకాల్సిందే అన్నది విశాఖపట్నంలో ఓ నర్సు. మా ఆర్కే బీచ్‌లో కెరటాలు కూడా వేడెక్కిపోతున్నాయి. ఆదిలాబాదు నుంచి చిక్కోల్ దాకా చమ్డాలెక్క లాగేస్తోంది దిక్కుమాలిన ఎండ అంటున్నారు జనాలు, ఎవరి యాసలో వాళ్ళు- యాసలోనే గాని యాతనలో ‘్ఫర్క్’లేదు. ఓల్ ఇండియా మొత్తంమీద తెల్గు స్టేట్స్ ‘జ్యాదతర్’ మంటెత్తిపోతున్నాయి అని చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్. క్రికెట్ ప్లేయర్స్ తప్ప ఈ మంటలకి మరొకడు తట్టుకోలేడు- ‘ఐసుక్రీము కోను’ కొరుక్కుంటూ.. నాకుతూ కాదు చెప్పాడో ఇస్టూడెంటు.
ఇక, తెలంగాణ ఎలా ఉన్నదీ అంటే, పెనం మీద నుంచి పొ య్యిలో పడ్డట్లుగా అల్లాడిపోతున్నది. సిటీ 43డిగ్రీలకే హాహాకారాలెత్తేస్తూ వుంటే, సూర్యభగవానుడు అగ్గిరుద్రుడై నల్గొండ, అదిలాబాదు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలను నలభై నాల్గు డిగ్రీల అస్పాస్ గర్మీతో కాల్చుకు లేదా వేపుకుని తింటున్నాడు, తార్రోడ్లమీద తారుడుకుతున్నట్లే వున్నాయి రాస్తాలన్నీ.. కోస్తాకే లేదు దిక్కు, రాయలసీమలో విధించబడని కర్ఫ్యూ సాగిస్తూన్నది. నదులే ఎండిపోతున్నాయంటే చెరువులు, చలమలు ఎక్కడ? నేలమీద ద్రోణి వచ్చింది- ఎక్కడో ‘ఎల్నినో’ లేచింది లాంటి కబుర్లు కుండలోకి గ్రుక్కెడు నీళ్లు తేగలవా? తడిగుడ్డలు నెత్తిన వేసుకోగలిగితేనే చాలు మురిసిపోతున్నారు. వాయవ్యం నుంచి వేడిగాలులు విపరీతంగా వస్తున్నాయి, అదీ కారణం అన్నాడు ఓ మార్నింగ్ వాకర్. ఈ ఎండల్లో ఒక్క ఐపిఎల్ క్రికెట్ వీరులు తప్ప ఇంకెవరూ నిలబడలేరు- సమ్మర్ క్రికెట్ మజా తీసుకొనే జనాలున్నారు.
ఏసిలా, కూలర్లా.. రోజూ 44 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటే ఉన్నవాళ్ళు వాటిని ఆఫ్ చెయ్యడానికి ధైర్యం చెయ్యలేకపోడంతో కరెంటు సప్లై ‘ట్రిప్’- కరెంటు ఫట్. ఇలా మొదటికే మోసం వస్తోంది- అపార్ట్‌మెంట్లలో వాచ్‌మాన్-సెక్యూరిటీ -లేదా ఇంకా కాకపోతే ఎస్టేటు మేనేజర్! జనరేటర్ ఆన్ కరో భాయ్ అంటూ ఆర్తనాదాలు- ఆనూ ఆఫూ అంటూ వుంటే తెల్లార్లు నిద్రలేక చేస్తున్నాం అంటూ వాళ్ళ ప్రోటెస్టులూ - ఇలా గడిచిపోతోంది. ఏసీ యూనిట్లు, రిఫ్రిజిరేటర్లూ, వాషింగ్ మెషీన్లు, రుబ్బర్లూ వగైరా జనరేటర్లకి తగిలించుకోరు- సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవీ అన్నట్లు పల్లెజనాలకి గ్రుక్కెడు నీళ్ళకే కరువు- బోర్లు కూడా ఉలకవ్ పలకవ్... వున్న నీరంతా సూర్యభగవానుడే విపరీతమైన దాహంతో తాగేస్తూవుంటే- ఆసుపత్రులకే నీళ్ళు, కరెంటూ దొరక్కపోతూ వుంటే? దానే్న సమ్మర్ అంటారు. మా చిన్నప్పుడు ఏదైనా హోటలు కనబడితే లోపలికి దర్జాగా వెళ్లి (విద్యార్థులంగా) అక్కడ బల్లలమీద వరసగా పెట్టిన గ్లాసులు ఖాళీ చేసి పోయేవాళ్ళం- చలివెందర్లకే పోవాలి అంటే భయం ఇప్పుడు- కుండలే కాని వాటిల్లో నీళ్లుండటం లేదిప్పుడు-
బెజవాడ గాలి దుమారాలకు, హైద్రాబాదు వడగండలల్ వానలకు ప్రసిద్ధి- అక్కడ చిన్న రసాలు ఇక్కడ అల్ఫాంసో సరదాలు. గాగుల్స్, నెత్తిన గడ్డి టోపీలు ధరించి ఆఫీసులకు వెళ్లక తప్పదు. అక్కడ బాసు గదిలోకైనా ఏసీ వుంటుందిగా- ఏదో సాకున మేల్ ఎంప్లారుూస్ కూడా ‘సార్’ అంటూ ఆ గదిలోకి తొంగి చూడవచ్చు. నీడ వదిలి బయటకి పోమంటున్నారు జరుగుబాటు వున్నవాళ్ళు- అపార్టుమెంటు జీవులు పావురాలయిపోయారు. అసలీ ఎండలకి బామ్మలు బాగా తట్టుకుంటారు అన్నాడు మామిడికాయలు అమ్మే వ్యాపారి ఒకడు. తెల్గువాడి కిష్టం యావత్ ప్రపంచ ప్రసిద్ధం అయిన ఆవకాయ పచ్చడి. అది లేనిదే ముద్ద దిగదు. కాని సదరు ప్రాజెక్టు బామ్మల, అమ్మల, అత్తల జన్మహక్కు- ఎండలు లేకపోతే, నో ఆవకాయ- నో డిన్నర్ అంటుంది కాలేజీ పాప. ఎండలకి, కరెంటు కష్టాలకి, నీటి ఎద్దడికి తట్టుకోలేక సూర్యభగవానుణ్ణి తిట్టనివాళ్ళు వుండరు. ఇంతకన్నా హాయిగా వానాకాలమే బెటర్- గొడుగులో, రైన్‌కోట్‌లో వుంటే ఏమి హాయిలే హలా అంటూన్న ‘జీన్స్’కి మరి ఆ వానలు కురవాలి అంటే ఈ ఎండలు- అప్పుడు రాతలు వేస్తూ ఎర్ర పచ్చళ్ళు తినాలి అంటే మార్తాండతేజాన్ని ఆరాధించాలి. వున్న నీటిని తేమతో సహా సూరీడే పీల్చేస్తున్నాడు- కాని ఆ దేవుడే మనిషికి మాంగో జ్యూసు, పుచ్చకాయ బద్దలు, తాటిముంజెలు, నిమ్మబద్దలు ప్రసాదించాడు- నీ దేముడికి మందారాలు, ప్రేయసికి మల్లెపూలు, పెద్దకొబ్బరి బోండాలు చిన్న ఈతపళ్ళు- ఇవన్నీ ‘హూ గేవ్ యూ?’ ఆ సూర్యదేవుడే- ఇక అర్ధరాత్రి కూడా నిప్పుల కొలిమి లాంటి కాలంలో కూడా ఆడబడు క్రికెట్‌ని మానవుడు ఇచ్చాడు.. సిటీజనుడు సర్వకాల సర్వావస్తలందు సమోసాలు, బిర్యానీలు ఆరగించగలడు. కాని పల్లె జనాలకే కష్టం. శ్రీరాముడు సీతమ్మవారి కోసం చెట్టు గట్టూ వెదుక్కుంటూ పోయినట్లు నీటిచుక్క కోసం పోవాలి- అట్టి తరి అక్కడకిపోయి నెక్స్ట్ ఇయర్ ఇంటికో బావి, వీధికో బోరు వేస్తాం అంటూ హామీల జల్లు కురిపిస్తాడు పాలకుడు. ఈలోగా మీరు రెండు జీవనదులున్న తెలుగుబిడ్డని నేను నాకేమిటి? నో వాటర్ ప్రాబ్లం అని విర్రవీగుడు- ఒక చేత్తో మొబైల్, రెండో చేత్తో వాటర్ బాటిల్ ధరించి ధైర్యంగా బయటికి ఎర్రటి ఎండలోకి పొండు! కాకపోతే, ఓ నీరుల్లిపాయ పెట్టుకొని మరీ వెళ్లండి.
కమ్ జూన్ కమ్ రైన్స్, డోండ్ వర్రీ బీ హ్యాపీ!
*