ఉత్తరాయణం

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం... మరోవైపు మూడు నెలలు దాటినా జీతాలు లేకపోవడంతో నిరుత్సాహం.. ఇదీ రాష్ట్రంలోని లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీనస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి మానస పుత్రిక సచివాలయం వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడి ముంగిటకే చేర్చాలన్న సదుద్దేశంతో ఏర్పాటైనవే గ్రామ, వార్డు సచివాలయాలు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు అక్టోబర్ 2న శ్రీకారం చుట్టారు. అయితే జనవరి 26నుంచి సచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందనున్నాయి. అయితే ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. సచివాలయ ఉద్యోగులలో దాదాపు 70 శాతం మంది మధ్యతరగతి వారే! ప్రతీ నెల జీతం (రూ.15,000) అందుకున్న కుటుంబం గడవలేని దుస్థితి వారిది. జీతం వస్తేనే పూట గడిచే మధ్యతరగతి వారికి మూడు నెలల నుంచి జీతాలు అందక పోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించే ఖాతా (010) విషయంలో కూడా ఇంతవరకు అధికారికంగా స్పష్టమైన ఆదేశం రాలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు.
- బట్ట రామకృష్ణదేవాంగ,
సౌత్ మోపూర్, నెల్లూరుజిల్లా