ఉత్తరాయణం

టీమ్ ఇండియాకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ క్రికెట్ టెస్టులో టీమ్ ఇం డియా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయభేరి మ్రోగించి రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకొని ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పట్టికలో 360 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని చేరుకోవడం గొప్ప విశేషం. ఈ టెస్ట్‌సిరీస్ విజయంతో కోహ్లీ సేన తమ సొంత గడ్డపై 12వ సిరీస్ విజయం సాధించి ఔరా అనిపించింది. టీం ఇండియా ఈ టెస్ట్‌సిరీస్ విజయంతో అద్భుతమైన ప్రపంచ రికార్డును నమోదు చేసుకుంది. ఇంతవరకు మారే జట్టుకూడ టీం ఇండియా మాదిరి ప్రపంచ క్రికెట్‌లో వరుసగా 4వ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ ఏడాది యావత్తు గెలుపే తప్ప ఓటమి ఎరుగని కోహ్లీసేన వరుసగా 7 టెస్ట్ విజయాలు నమోదు చేసి, 2013లో ధోని నేతృత్వంలో టీం ఇండియా వరుసగా 6 టెస్ట్‌లలో విజయం సాధించిన రికార్డును తెరమరుగు చేసింది. గతంలో ధోని నేతృత్వంలోని టీం ఇండియా 9 ఇన్నింగ్స్ విజయాలు సాధిస్తే ఇప్పుడు కోహ్లీసేన రికార్డు స్థాయిలో 11 విజయాలు నమోదు చేసింది. టీం ఇండియా ఇపుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అదరగొడుతున్నది. గతంలో టీం ఇండియా విజయం సాధించిన ప్రతిసారి స్పిన్ బౌలర్ల పాత్ర కీలకం. ఈసారి ఫాస్ట్‌బౌలర్లు ఇషాంత్‌శర్మ, ఉమేష్‌యాదవ్ కీలక పాత్ర పోషించారు. కోల్‌కత టెస్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్ ఇషాంత్‌శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ను చేజిక్కించుకోవడంతోపాటు ఈ రెండు టెస్ట్‌లలో చూపిన ప్రతిభకు గాను మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవడం జట్టుకే గర్వకారణం. బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, ఛటేతేశ్వర పుజారా బ్యాటింగ్‌లో మంచి స్కోర్లు సాధించి ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించారు. కొంతకాలంగా విరాట్ కోహ్లి సారథ్యంలోని టీం ఇండియా ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా నిలుస్తూ, తన జైత్రయాత్రను కొనసాగించడం ప్రశంసనీయం. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని, బాగా రాటుదేలి టీం ఇండియా ఇప్పుడు అజేయశక్తిగా ఎదిగి ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. ఈ విజయాలు భారత క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగించేవే. జయహో టీం ఇండియా, మేరా భారత్ మహాన్.
-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల
మోడల్ స్కూళ్లకు మోక్షం ఎపుడు?
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలోని రెగ్యులర్ సిబ్బంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ సమస్యలకు ప్రభుత్వం ఇకనైనా ముగింపు పలికి న్యాయం చేయాలని వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. 2012లో ప్రత్యేకంగా జరిగిన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన ఈ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అమలు కాకపోవడం, వేతన సవరణ సకాలంలో జరగకపోవడంతో వీరంతా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న విధానం ప్రకారం పెన్షన్ స్కీంలో భాగస్వామ్యం అవ్వడానికి సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్య పథకంలో చోటులేకపోవడం, కీలకమైన సర్వీస్ నిబంధనలు అమలులో ఆలస్యం జరగడం వల్ల రెగ్యులర్ సిబ్బంది అయినప్పటికీ అనేక రకాలుగా వివక్షకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు సర్వీస్‌లో ఉండగా చనిపోయారు. మరణించిన రెగ్యులర్ సర్వీస్ ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి. కారుణ్య నియామకాలకు అవసరమైన చర్యలు ప్రారంభించి తక్షణం ఉత్తర్వులు విడుదల చేసి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వం మిగతా యాజమాన్యాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బందికి ఇచ్చే సౌకర్యాలు మోడల్ స్కూళ్ల రెగ్యులర్ సిబ్బందికి కూడా ఇవ్వాలి. ఇదే ప్రతిపాదనలతో గతంలో శాసన మండలి సభ్యుల కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల సిబ్బందికి భాగస్వామ్య పెన్షన్ ఉత్తర్వులను అమలు చేయకుండా సాంకేతిక కారణాలతో గతంలో ప్రభుత్వం నిలిపివేసింది. కనుక మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల జీతం నుండి మినహాయింపులు జరిగే విధంగా ప్రస్తుత చట్టబద్ధత లేని 2009 సెకండరీ ఎడ్యుకేషన్ సొసైటీని సంస్థ నిబంధనల ప్రకారం రద్దుచేసి మోడల్ స్కూళ్ల వ్యవస్థను నేరుగా ప్రభుత్వంలో లేదా విద్యాశాఖలో విలీనం చేసినప్పుడే న్యాయం జరుగుతుం ది. మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సంక్షేమం విషయాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. గత అయిదు సంవత్సరాల కాలంలో మోడల్ స్కూళ్లకు సంబంధించిన విధానపరమైన అంశాలు, వాటితో ముడివడిన సమస్యలను పరిష్కరించేలా ఎలాంటి కృషి జరగలేదు.కనుక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మోడల్ స్కూళ్ల వ్యవస్థపై స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలి.
-బి.సురేష్, శ్రీకాకుళం