ఉత్తరాయణం

భారత్ భేషైన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్’ ఒప్పందం విషయమై భారత్ వ్యతిరేకించడం, వైదొలగడం సరైన చర్య. 16 ఆసియా పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని నెలకొల్పేదిశగా 2013 నుండి ప్రతిపాదనల్లో వున్న ఒప్పందం ఖరారైతే భారత్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ రీతిలో ఉండేది. ప్రపంచ జనాభాలో సగం మంది నివసిస్తున్న ఈ దేశాల గ్రూపులో ప్రపంచ వాణిజ్యం మొత్తంలో 40 శాతం నడుస్తూ వుంది. ఈ దేశాలన్నీ ఒకే మార్కెట్‌గా తయారైతే అతి పెద్ద మార్కెట్‌గా అవతరించేది. అయితే దానివల్ల భారత్‌కు నష్టమే ఎక్కువగా కనబడుతుంది. అందుకనే రైతు సంఘాలు, వివిధ పక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచాయి. ప్రభుత్వం తాను ఈ ఒప్పందానికి ససేమిరా అన్నంతవరకూ అంగీకరిస్తున్నట్టే కనబడడం వల్ల ఆందోళన అధికమైంది. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా ఒప్పందాన్ని వ్యతిరేకించడం మన దేశాన్ని ఒక ఉపద్రవం నుండి తప్పించినట్టయింది.
ముఖ్యంగా భాగస్వామ్య దేశాలతో వున్న వాణిజ్యంలో దాదాపు అన్ని దేశాలతో మన దేశానికి ట్రేడ్ డెఫిసిట్ వుంది. అంటే ఆయా దేశాలకు చేస్తున్న ఎగుమతుల కన్నా ఆ దేశాల నుండి వస్తున్న దిగుమతులు ఎక్కువన్న మాట. చైనాతో 50 బిలియన్ డాలర్ల మేరకు లోటు వుంటే, ఆసియన్ దేశాలతో 21 బిలియన్ డాలర్ల లోటు ఉంది. అంతమేరకు మన డబ్బు విదేశాలకు పోతున్నట్టు లెక్క. ఒకవేళ ఈ ఒప్పందం జరిగివుంటే, సుంకాలు తగ్గి మరిన్ని దిగుమతులు వెల్లువెత్తేవి. దేశీయ ఉత్పత్తులకు పోటీ తీవ్రమై నష్టం జరిగేది. ఇప్పటికే కష్టాల్లో వున్న వ్యవసాయ రంగం కుదేలయ్యేది. న్యూజిలాండ్ నుండి పాల దిగుమతులు పెరిగి, చైనా నుండి స్టీల్ మొదలుకొని వివిధ వస్తువులు వెల్లువెత్తి మన ఆర్థిక రంగం కుదేలయ్యేది. వినిమయదారుడికి చౌకగా రూపాయి లాభం జరిగితే,దేశానికీ పరోక్షంగా వంద రూపాయల నష్టం జరిగేది. పైగా మన ఎగుమతులకు పూచీ పడే మార్కెట్‌పై కూడా సందిగ్ధమే. దేశం ముందుగా ఆర్థికంగా స్వంత ఇంటిని చక్కదిద్దుకోవాలి. వ్యవసాయం లాభసాటి కావాలి. ఎగుమతులు చేసే స్థాయికి పరిశ్రమలు ఎదగాలి. ప్రస్తుతం రెండు రంగాలూ వృద్ధి లేమిలో పోటీపడుతూ, కష్టాల నుంచి ఒడ్డెక్కించే సరైన విధానాల కోసం ఎదురుచూస్తున్నాయి. పైదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని లాభపడే వాతవారణం ప్రస్తుతానికి లేదు. మేక్ ఇండియా అన్నది మాటల నుంచి క్షేత్రంలోకి అనువాదం అయినప్పుడే ఆ వెసులుబాటు కలుగుతుంది. ప్రాప్తకాలజ్ఞత చూపిన ప్రభుత్వం, ప్రధాని అభినందనీయులు. ఈ ఒప్పందాన్ని రైతు సంఘాల నాయకత్వం వ్యతిరేకించగా, పరిశ్రమ వర్గాల ప్రతినిధులు (సిఐఐ) కోరుకున్నారు. సప్లై చైన్ పెరుగుతుందని, దేశానికీ లాభమని అభిప్రాయపడ్డారు. అన్ని వైపులా బేరీజు వేసి వుంటే అలా అనగలరా?
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మాటలకు అందని అమానుషత్వం
హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే పట్టపగలు పెట్రోలు పోసి నిప్పంటించి హతమార్చడం అత్యంత అమానుషమైన ఉన్మాద చర్య. ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా సమస్య ఎదురైనపుడు అక్కడి అధికారులు స్పందించని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. శాంతియుత పద్ధతుల్లో ఆందోళన చేయవచ్చు. కానీ ఇలా మహిళా అధికారిణిపై పెట్రోలు పోసి నిప్పంటించడం అతి దారుణం. ప్రజల కోసం పనిచేసే నిజాయితీపరులైన అధికారులకు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు ఏ రూపంలో దాడి చేస్తారోనన్న భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పల్లెలు, నగరాలు అన్న తేడా లేకుండా ఉన్మాదులు కిరాతకచర్యలకు పాల్పడుతున్నారు. చట్టాలు, కోర్టుల పట్ల భయం లేకుండా పోవడమే ఈ దారుణాలకు కారణం. మరోవైపు కొంతమంది ప్రజాప్రతినిధులు కొన్ని శాఖల అధికారులపై ప్రజలను రెచ్చగొడుతున్నారు. దీంతో నిజాయితీగా పనిచేసే అధికారులపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారింది. ఇంకోవైపు అవినీతిపరులైన అధికారులకు కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పేదలకు న్యాయం జరగడం లేదు. కొంతమంది అధికారులు చిత్తశుద్ధితో పనిచేద్దామన్నా వారిపై రాజకీయాల ప్రభావం పడుతోంది. అంకితభావం ఉన్న అధికారులు ప్రజల కోసం సేవ చేసే పరిస్థితులు నానాటికీ మృగ్యమవుతున్నాయి. అన్ని స్థాయిల్లో స్థానిక రాజకీయ నాయకులు జోక్యం, నేరగాళ్ల ప్రమేయం పెరుగుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొన్న ప్రాంతాల్లో అధికారులు నిజాయితీగా పనిచేయడం కత్తిమీద సాములా మారింది. ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించి, భూ వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అధికారులు భయం లేకుండా పనిచేసే అవకాశం ఉంటుంది. మహిళలు పనిచేసే చోట సీసీ కెమెరాల నిఘాతో పాటు భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.
-పి.రాజేశ్, వనస్థలిపురం