ఉత్తరాయణం

సమ్మెలపై ద్వంద్వ వైఖరి తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కార్మికుల, ఉద్యోగుల సమ్మెలను వ్యతిరేకించటం, అధికారం లేనిచోట బేషరతు మద్దతులు పలకటం పరిపాటిగా మారింది. ప్రజాప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే నేతలకు ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కింది తరగతి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా వుండేది. వారి స్థితిగతులు మెరుగుపరచటానికి, తెల్లదొరలను దేశం నుండి వెళ్ళగొట్టటానికి అలనాటి మన జాతీయ నేతలు సమ్మెను ఒక ఆయుధంగా వాడుకున్నారు. తెల్లదొరల ప్రభుత్వం పోయి నేడు ప్రజల కోసం ప్రజలచేత ఎన్నుకోబడుతున్న ప్రజా ప్రభుత్వాల శకం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగ భద్రత లేని ఐటీ, కార్పొరేట్ రంగాలను మినహాయిస్తే ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు, సెలవులు మిగతా ఉద్యోగుల కంటే ఎంతో మెరుగ్గా వున్నాయి. కనుకనే ఉన్నత విద్యావంతులు, స్థితిపరులు కూడ చిన్నచిన్న ప్రభుత్వోద్యోగాలకు సైతం ఎగబడుతున్నారు. ప్రభుత్వాలు అట్టడుగున వున్న పేద, సామాన్యుల గోడు పట్టించుకోవాలి. అధికారంలోకి రావటానికి రాజకీయ పక్షాలు అన్నివర్గాలకు ఎన్నో వాగ్దానాలు చేస్తాయి. తక్షణమే హామీలను అమలుచేయాలంటే మళ్ళీ ప్రజలపై భారం తప్పదు. సమ్మెలతో విపక్షాలు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నా, డిమాండ్లన్నీ అంగీకరిస్తే పన్నుపోట్లు, చార్జీలు, జీవన వ్యయం పెరిగి ‘చెంపదెబ్బ- గోడదెబ్బ’లా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే, మంత్రులకు పోయేదేమి లేదు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు జీతాల పెంపు, పనిభారం వంటి అంశాలే కాకుండా, తమ సంస్థ నష్టాల గురించి కూడా నిరసన గళం విప్పాయి. ప్రభుత్వమే చొరవ తీసుకొని కొత్త సిబ్బంది నియామకాలు, రాయితీ మొత్తాల చెల్లింపు, డీజెల్‌పై పన్ను తగ్గింపు వంటి న్యాయమైన డిమాండ్లు అంగీకరిస్తే ఆర్టీసీపై కొంత ఆర్థిక భారమైనా తప్పుతుంది. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై చైతన్యపరచాలి. మన దేశం ఆర్థికంగా ఎంతో ఎదిగినా నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, ఆకలి కేకలు విపరీతంగా పెరిగి పొరుగున వున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలకంటే అధమ స్థానానికి దిగజారుతోంది. మన రాజకీయ పార్టీలు ప్రైవేట్ రంగంలోని పేద కార్మికులపై దృష్టి పెట్టాలి. ఆదివారం కూడ వ్యాపారాలు నిర్వహించుకోటానికి ప్రభుత్వం అనుమతించటంతో కొన్నిచోట్ల సిబ్బందికి సక్రమంగా వారాంతపు సెలవులు లభించక వెట్టిచాకిరీ చేస్తున్నారు. అటువంటివారి స్థితిగతులు మెరుగుపరచటానికి కృషిచేయాలి.
-టీసీ సాంబశివరావు, నర్సరావుపేట
నిరుపేద భారతం!
మన దేశం నానాటికీ నిరుపేదలకు నిలయంగా మారుతోంది. నిరుద్యోగం, దారిద్య్రంతో నలుగుతూ దేశం సమస్యలను ఎదుర్కొంటోంది. పేదవాడి కష్టానికి ఫలితం లేకుండాపోతోంది. ఎందరు రాజకీయ నేతలు అధికారం చేపట్టినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా సామాన్యుడు మాత్రం నిరుపేదగానే మిగిలిపోతున్నాడు. భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్న మన నేతల మాటలు అవాస్తవం. చాలా విషయాల్లో మన దేశాన్ని ప్రపంచ దేశాలు అవహేళనగా చూస్తున్నాయి. రాజకీయ నేతలు దేశాన్ని అస్థిరపరచి చోద్యం చూస్తుండటం గమనార్హం. భారత్ ఇంకా అనేక రంగాల్లో వెనుకపడి పోయిందనడం వాస్తవం. ఆర్థిక అసమానతలు, హింస, శాంతి భద్రతల లోపంతో ప్రజలు స్వేచ్ఛను కోల్పోతున్నారు. దేశంలో హత్యలు, అత్యాచారాలు, సాంఘిక దురాచారాలు, దౌర్జన్యాలూ, మోసాలు, మూఢ నమ్మకాలూ, అనాగరికత, దళారీ వ్యవస్థలు అంతం కాలేదు. ఏ ప్రభుత్వమూ పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. సామాన్యుడిపై ప్రభుత్వ పెత్తనం అధికమైపోతోంది. ప్రజాధనాన్ని రాజకీయ నేతలు దోచుకుతింటూ దేశాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వాలు సామాన్యునికి వౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్నాయి. పేదవాడి కడుపు నింపలేక పోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజల మధ్య విభేదాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, యుద్ధాలు జరగక మానవు. శాంతి మంత్రం వినిపించకుండాపోయి ప్రజాస్వామ్యం కనుమరుగయి పోతుంది. ఎవరిలోనయినా మార్పును తీసుకురావచ్చు కానీ రాజకీయ నేతలో ఒకింతయినా మార్పు తీసుకురావడం అసాధ్యం అనిపిస్తోంది. స్వార్థమే పరమావధిగా చేసుకున్న నేతల మనసులు మొద్దుబారి పోతున్నాయి. నిజమైన ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చే నాయకుల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తూంది. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. రాజకీయ చదరంగంలో ప్రభుత్వాలు సామాన్య, మధ్యతరగతి వారిపైనే పెనుభారం మోపుతున్నాయి. రకరకాల సుంకాలూ, ఛార్జీలు, జిఎస్టీ పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. రాజకీయ వ్యవస్థ అవినీతి, నేరాలు, అనైతిక ఫిరాయింపులతో కంపుకొడుతోంది. ప్రజలను అణచివేతకు గురిచేయడం, ఎదురుతిరిగిన వారిని వేధించడం నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. వివిధ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మారుతోంది. నిరుపేద బతుకులు దుర్భరంగా మారుతూ, ఈ పుణ్యభూమి నిరుపేద భారతంగా అవతరిస్తోంది.
-డి.చాంద్‌బాష 97010 30480

-కె.విజయ శైలేంద్ర 98499 98097