ఉత్తరాయణం

ఏకరూప దుస్తులేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు విద్యాసంవత్సరం మొదలై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రెండు జతల ఉచిత యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) రాకపోవడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ బడులలో బడుగు, బలహీనవర్గాల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు దుస్తులు సకాలంలో అందచేస్తున్నా, బడిపిల్లల పట్ల మాత్రం వివక్ష చూపుతోంది. దీంతో ప్రభుత్వ బడులపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గుతున్న క్రమంలో సకాలంలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందకపోవడం దారుణం. గురుకులాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ బడులకు ఇవ్వకపోవడం శోచనీయం. సౌకర్యాల లేమితో పిల్లల సంఖ్యను ప్రభుత్వమే తగ్గిస్తున్నట్లు భావించాలి. గురుకులాల్లో సీట్లు అందరికీ లభ్యం కావు గనుక పేదవర్గాల పిల్లలు ప్రభుత్వ బడులను ఆశ్రయించక తప్పడం లేదు. అరకొర వసతుల మధ్య విద్యాబోధన చేస్తూ ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు, గురుకులాల వైపు మొగ్గుచూపుతున్నారు. పాలకులు వివిధ పేర్లతో గురుకులాలను స్థాపిస్తూ ప్రభుత్వ బడులను పట్టించుకోవడం లేదు. గురుకులాలలో సకాలంలో దుస్తులు, ఇతర వస్తువులు అందిస్తున్నట్లుగానే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాటిని అందించాలి. గురుకులాలలోలాగే ప్రభుత్వ బడులకు భోజనం మెనూ వర్తింపచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
-సామంతుల సదానందం, పరకాల
పులిని చూసి..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ప్రచారక్‌ల వలె కాంగ్రెస్ పార్టీ ప్రేరక్‌లను నియమించుకుంటోందని వచ్చిన వార్త నిజమైతే- పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న చందాన వుంటుంది. తరతరాల ఈ దేశ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు స్వయం ప్రేరితులై, బ్రహ్మచర్యం దీక్షగా కార్యక్షేత్రంలో పనిచేసే త్యాగశీలురు ఆరెస్సెస్ ప్రచారక్‌లు. తరతరాలుగా స్వతంత్ర భారతాన్ని ఒకే కుటుంబ పాలనకు అంకితం చేయడానికే పనిగట్టుకున్నది కాంగ్రెస్. ఎదిగివచ్చే ప్రతితరం గుర్తుపెట్టుకోడానికి నెహ్రూకు బాలలంటే ఇష్టమని ఓ డిజైను రూపకల్పన చేశారు. పిల్లలంటే ఎవరికష్టం వుండదు? ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిర అని గతంలో అన్నారు. ఎప్పుడు ఏది, ఎందుకు మాట్లాడ్తాడో తెలీని రాహుల్ చేతిలో కాంగ్రెస్ పార్టీ పడింది. కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్న గాంధీజీ కోరిక త్వరలోనే తీరబోతోందేమో?
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
పాక్ దురహంకారం
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ శాంతికోసం, ఉగ్రవాద నిర్మూలన కోసం మహాత్మాగాంధీ బోధించిన అహింసా సిద్ధాంతాలను పేర్కొంటూ అన్ని దేశాల నాయకులను, ప్రపంచ ప్రజలను ఆకట్టుకున్నారు. అదే సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత దేశంమీద విద్వేషభావంతో తన అక్కసునంతా వెళ్ళబోసుకుని అందరి దృష్టిలో చులకన అయ్యారు. పాక్ ప్రధానులంతా మొదటినుండి భారతదేశాన్ని ప్రత్యర్థిగానే భావించారు. జుల్ఫికర్ అలీ భుట్టో భారత్ మీద వెయ్యేళ్ళయినా యుద్ధం చేస్తామన్నాడు. ఆయన ఆ దేశంలోనే ఉరితీయబడ్డాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోని భూభాగమేనన్నది మరోసారి చెప్పనక్కరలేదు. అనేక రాజకీయ కారణాలతో ఆ సమస్య ముడి విడడం లేదు. మోదీ హయాంలో కాశ్మీర్ మొత్తం భారత్ పరం అవుతుందని ఆశిద్దాం.
- ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్