ఉత్తరాయణం

పర్యవేక్షణ లోపంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాంచీలను పరిశీలించకుండా పర్యాటక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో నదుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరద హెచ్చరికలను లెక్కచేయకుండా ధనార్జనే ధ్యేయంతో లాంచీలను నడపటంతో ఇటీవల పాపికొండల యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా వేరే మార్గంలో గోదావరిలో బోటు నడపడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో వుంచుకోకుండా, భద్రతా చర్యలు తీసుకోకుండా పర్యాటకులను బోటులో తీసుకొని వెళ్లడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. లాంచీ యజమానులు అధికారుల మాట లెక్కచేయకుండా విహార యాత్రకు బోటును నడపడం దారుణం. పర్యవేక్షణ లోపం ప్రధాన తప్పిదం కావడంతో విహారయాత్రలు విషాద యాత్రలుగా మారుతున్నాయి. లాంచీలో ఎక్కిన పర్యాటకుల వివరాలు కూడా సేకరించకుండా ఎక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా పాపికొండల విహారయాత్రలో లాంచీలను పర్యవేక్షించాల్సిన బాధ్యత పర్యాటక శాఖ సహా ఇతర శాఖల అధికారులపై ఉంది.
-అయినం రఘురామారావు, ఖమ్మం
వేధింపులతో ఆత్మహత్యలు
అప్పులు తీర్చలేక రైతులు, ఆర్థిక నష్టాలతో వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరికీ తెలిసిందే. పేదరికం భరించలేక తల్లీపిల్లల బలవంతపు మరణాలను చూస్తున్నాం. పనివత్తిడి వల్ల, పై అధికారుల వేధింపుల వల్ల బ్యాంకు మేనేజర్లు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజామాబాద్‌లో ఓ తహశీల్దార్ ఏ ఆర్థిక బాధలు లేకపోయినా, ఉన్నతాధికారుల సాధింపులు తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలించడం తెలంగాణలో పెద్ద దుమారం లేపింది. ఉద్యోగం అన్న తరువాత బాధ్యతలు ఉండక తప్పదు. వాటిని సమర్ధవంతంగా నిర్వర్తించడం, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండడం అధికారులు నేర్చుకోవాలి. ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగులను వేధించడం మానుకోవాలి. వత్తిళ్లను ఎదుర్కొనే ఉద్యోగులకు ‘స్ట్రెస్ మేనేజిమెంట్’ తరగతులను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది.
-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్
మిస్సైల్ మ్యాన్
ఆయన... ఓ మహర్షి
ఓ మహామనీషి
ఆ వ్యక్తిత్వం మానవీయం
ఆ అస్తిత్వం అనుసరణీయం

ఆయన... ఓ శాస్తవ్రేత్త
ఓ సాహితీవేత్త
ఆ ‘మాట’ విజ్ఞాన పూతోట
ఆ ‘అడుగు’ ఆదర్శాల బాట

ఆయన... ఓ శ్రామికుడు
ఓ సాహసికుడు
ఓ అనితర సాధ్యుడు
ఆ ‘చూపు’ కాంతిధార
ఆ ‘నవ్వు’ నవ్య జీవధార

ఆయన... ఓ నిత్య విద్యార్థి
ఓ సత్య శోధకుడు
ఆ ‘పలుకు’ వరప్రసాదం
ఆ ‘ప్రవచనం’ స్ఫూర్తిదాయకం

కలలు కనండి, సాకారం చేసుకొండంటూ
యువతకు ప్రేరణ నింపిన
నిలువెత్తు ఆత్మవిశ్వాస శిఖరం

అణ్వస్త్రాల దేశ అమ్ముల పొదిలో
పొదిగిన ‘మిస్సైల్’ మ్యాన్
దేశ ‘ప్రథమ’పౌరునిగా జాతి కీర్తిని
విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి
జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన
అద్భుత వ్యక్తి అబ్దుల్ కలాం విశిష్ట శక్తి

ఓ మహాశయా! నీ ‘పుట్టుక’కు
పుడమి తల్లి పులకిస్తోంది
జాతి జాతి గర్విస్తోంది
యావత్ ప్రపంచం
శిరస్సు వంచి నమస్కరిస్తోంది
-కోడిగూటి తిరుపతి 95739 29493
*
నేడు అబ్దుల్ కలాం జయంతి