ఉత్తరాయణం

సమాచార హక్కు చట్టానికి తూట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుండి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే ‘సమాచార హక్కు’. పాలనలో పారదర్శకతను పెంచి అవినీతిని అరికట్టేదే సమాచార హక్కు చట్టం. భారత ప్రభుత్వం అక్టోబర్ 12, 2005 తేదీన సమాచార హక్కు చట్టాన్ని దేశం అంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులెవరైనా పొందవచ్చు. ఒకప్పుడు పార్లమెంటు లేక విధానసభ, విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికీ కలిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు పౌరులు అడగకపోయినా వారంతటవారే విధివిధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారుల పేర్లు, అప్పిలెట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను ప్రజలకు కనిపించే విధంగా బోర్డు మీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మొత్తం 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉన్నాయి.
రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు మొదలైనవి సమాచారం కిందకు వస్తాయి. ఉదాహరణకు
* రేషన్ కార్డులు, నిత్యావసరాల అమ్మకాల వివరాలు.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిధులు, ఖర్చులు, లబ్ధిదారుల వివరాలు.
* ప్రజాప్రతినిధుల (ఎం.పీ, ఎం.ఎల్.ఏ, ఎం.ఎల్.సి.) నియోజకవర్గ అభివృద్ధి నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలు.
* ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు, ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి వివరాలు. ఏ ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉన్న సమాచారాన్నైనా సేకరించుకునే హక్కును స.హ.చట్టం 2005 కల్పించింది. సదరు సమాచారాన్ని కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి నోట్సు తీసుకునేందుకు, ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమాచారాన్ని ప్లాపీలు, డిస్క్‌లు, వీడియో క్యాసెట్ల ద్వారా గాని, ప్రింట్ అవుట్ల ద్వారా గాని ఎవరైనా పొందవచ్చు.
సమాచారం పొందగోరేవారు సంబంధిత కార్యాలయం ప్రజాసమాచార లేక సహాయ ప్రజాసమాచార అధికారులకు దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తు తెల్లకాగితంపై రాస్తే చాలు. తెలుపు రేషన్ కార్డులున్నవారు, గ్రామస్థాయి సంస్థలలో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం లేదు, మండల స్థాయిలో రూ.ఐదు, జిల్లాస్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చుమాత్రం దరఖాస్తుదారు నుండి వసూలుచేయవచ్చు. అడిగిన తర్వాత నెల (30రోజులు) దాటితే ఎంతటి సమాచారం అయినా ఉచితంగా ఇవ్వాలి. ఇవ్వలేకపోతే లేక తిరస్కరిస్తే దానికి గల కారణాలు తెలపాలి. నెల రోజుల లోపు సమాచారం అధికారి ఇవ్వని పక్షంలో పైఅధికారికి మొదటి అప్పీలు చేసుకోవచ్చు. నలభై అయిదురోజుల నుండి తొంభై రోజులవరకు మొదటి అప్పీలు అధికారి నుండి ఎలాంటి స్పందన రానపుడు ద్వితీయ అప్పీల్ సెక్షన్ 19(3)ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు వ్యక్తిగతంగా గాని, పోస్టుద్వారా గాని దరఖాస్తును పంపవచ్చు. దరఖాస్తు స్వీకరించకపోయినా, నిర్ణీత సమయంతో సమాచారం ఇవ్వకపోయినా, నిరాకరించినా, తెలిసి తప్పుడు సమాచారం ఇచ్చినా మరే విధంగానైనా ఆపినా రోజుకు 250 రూపాయల నుండి గరిష్టంగా 25,000 రూపాయల వరకు జరిమానా విధించాలని సెక్షన్ (20)(1) చెబుతోంది.
ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. అప్పీళ్ల విషయంలో కమిషనర్ల నిర్లక్ష్యవైఖరి కనిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. చట్టం గ్రామస్థాయి వరకు వెళ్లలేదు. గ్రామణ ప్రజల నిరక్షరాస్యత, మధ్య తరహా పట్టణాలకే పరిమితం కావడం కూడా కారణాలే. సమాచార అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. రాష్ట్ర సమాచార కమిషనర్లుగా పది మందిని నియామకం చేయాలి. పాత్రికేయులు, సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులను రాష్ట్ర కమిషనర్లుగా నియమించాలి. స.హ.చట్టం ఉద్యమకారులను కమిషనర్‌గా తీసుకోవాలి. ఈ చట్టం సమాచారం అడిగే వారికి రక్షణ కల్పించాలి. ప్రజలలో అవగాహన పెరగాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట