ఉత్తరాయణం

మన గతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడొక్కసారి మన గతాన్ని పరిశీలిద్దాం. మన గతం అంటే సామాన్యం కాదు, చరిత్రకందని వేల ఏళ్ల చరిత్ర మనది. నేటి మన రాజకీయ నాయకులు కొంతమంది- ఎంతగా పట్టించుకోకపోయినా ఇక్కడే వేదాలు పుట్టాయి. రామాయణ, మహాభారతాల పుణ్యపురుషుల చరిత్ర ఈ దేశానిదే. నేటికీ మన పురాణేతిహాసాలు సజీవంగా ఉన్నాయి. ఆ గ్రంథాలు, ఆ వేదాలు ఉన్నాయి, ఆ పరంపర కొనసాగుతున్నది. ఒకవేళ ఇదంతా ‘మాకొద్దు’ అన్నా ప్రపంచం అంగీకరించదు. ఏ దేశమూ తమ దేశంలో వేదాలు జన్మించాయి అనదు, అనలేదు. అప్పటి నిర్మాణాలు, ఆ చరిత్రను ఎంత కాదనుకున్నా- అది మన గతం. మనం అంగీకరించక తప్పదు.
ఇదంతా హిందూ సంస్కృతే. ప్రపంచంలో తరువాత తరువాత పుట్టి, ప్రాబల్యంలోకి వచ్చిన ముస్లింలకు ఈనాడెన్ని దేశాలున్నాయి? క్రైస్తవులకెన్ని దేశాలున్నాయి? మరి ఇంత ఘనమైన గతం కలిగిన హిందువులకు- కనీసం ఒక్క దేశమైనా ఉండకపోవటం, ఉండకూడదని అనడం న్యాయ సమ్మతమా? అందులోనూ, ఇంతవరకు ఏ ఇతర సంస్కృతితోనో ఉన్న దేశాన్ని మనం కోరుకోవటం లేదు. మనం కోరేది, అడిగేదల్లా-ఈ హిందూ లేదా భారతీయ సంస్కృతి పరిఢవిల్లుతున్న ఈ భారతదేశాన్ని, దాని సంస్కృతిని- విచ్ఛిన్నం చేయవద్దనీ, దానిమీద దాడి చేయవద్దనీ మాత్రమే మనం కోరుకొనేది. ఎవరైనా దీన్ని కాదు.. కూడదంటే- మనం ఎదురుతిరగక తప్పదు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇంతవరకూ మన భారతదేశం ఏ విదేశం మీద, ఏ సంస్కృతి మీద దాడి చేయలేదు. దేనినైనా నాశనం చేద్దాం, ఆక్రమిద్దాం అనే చెడు ఆలోచనే ఇంతవరకూ, ఈ వేల సంవత్సరాల కాలంలో మన దేశానికి కలగలేదు.
ఇక ఇప్పటి మన రాజకీయాలు ఎలా ఉన్నాయంటే- పత్రికల్లో చదివారుగదా! మావోయిస్టులైతే ఆగస్టు 15నే బ్లాక్‌డేగా పాటించాలన్నారు. పార్లమెంటులో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు తలాక్ బిల్లుకు మద్దతు తెలిపినా- కొందరు మాత్రం- ముస్లింలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటారు.. ఏమనాలి? ముస్లిం ప్రజలూ వ్యతిరేకిస్తున్నారంటారు. ఇమాం మొహమ్మద్ తాహిదీ అనే ఇస్లామిక్ పండితునికన్నా వీరు నిజమైన ముస్లింలా? ఏమనాలి? ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా భారత్‌ను గుర్తింపజేసుకుని మిగిలిన సంస్కృతినైనా కాపాడుకుని తీరాలి. సామాజిక సమస్యలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. త్రిపుల్ తలాక్ కంటే ఘోరమైన అవమానం ముస్లిం స్ర్తిలకు మరొకటుందా? విదేశం నుంచైనా, పురుషుడు ఈ దేశంలో ముస్లిం స్ర్తికి ‘తలాక్’ చెపితే, అది చెల్లాలా? దానిని రద్దుచేయటం, బ్రాహ్మణ మతోన్మాదమా? ముస్లింలూ ఆలోచించండి.

-చాణక్య