ఉత్తరాయణం

సివిల్స్ పరీక్షలా? సచివాలయ పరీక్షలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలను చేపడుతోంది. అందులో భాగంగా మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే ఇవి అతి పెద్ద నియామక పరీక్షలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెప్టెంబర్ 1 (ఆదివారం)నుండి ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షలు 8వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా, ఆదివారం జరిగిన గ్రామ కార్యదర్శి నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం తీరు ‘పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం’ ప్రయోగించినట్టు ఉంది. ఉద్యోగాల స్థాయికి మించి వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. ప్రతి ప్రశ్న రెండు నిమిషాలకు పైగా సమయం తీసుకోవడంతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ప్రశ్నల సరళి గ్రూప్-1, సివిల్స్ స్థాయిలో ఉంటూ వారిని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రశ్నల కఠినత స్థాయి అధికంగా ఉన్నందున కటాఫ్ మార్కులను కూడా చేరుకోలేని దుస్థితిలో ఉన్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే జరుగుతుండడంతో అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధం కాలేకపోయారు. ఒకవైపు భారీ సిలబస్ మరోవైపు తక్కువ సమయం దానికితోడు రుణాత్మక మార్కులు ఉండడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహించిన నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలు ‘గోరుచుట్టుపై రోకటి పోటు’లా ఉన్నాయి. నిరుద్యోగులను మానసికంగా కుంగతీశాయి. ప్రశ్నలు సుదీర్ఘంగా, విశే్లషణాత్మకంగా ఉండడంతో సమయం సరిపోని పరిస్థితి ఏర్పడింది. కఠినతా స్థాయి, నెగిటివ్ మార్కులవల్ల అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు సూచించలేకపోయారు. దీంతో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు గరిష్ట మార్కుల స్థాయి 100లోపే ప్రాథమిక ‘కీ’ ప్రకారం 80 మార్కులు వచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సచివాలయ స్థాయి ఉద్యోగాలకు సివిల్స్‌స్థాయి ప్రశ్నలు ఏంటని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇదీ ఒక ‘కిందిస్థాయి’ నియామక పరీక్షేనా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంవల్ల లక్షలాది మంది నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేల రూపాయలు ఖర్చుపెట్టి వివిధ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులను ఈ పరీక్షలు పూర్తిగా అసంతృప్తి పరిచాయి. వారిని మరింత అప్పులపాలు చేశాయి. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి రాష్ట్రంలోని వేలాది ‘ఉపాధ్యాయ’ ఖాళీల భర్తీకి సిద్ధం కావాలి. అదే విధంగా వివిధ ప్రభుత్వం శాఖల్లో ఉన్న వేలాది ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు కాసింత ఊరట కలిగించాలి.
- బట్టా రామకృష్ణదేవాంగ, సౌత్‌మోపూర్ (నెల్లూరు జిల్లా).