ఉత్తరాయణం

నిరుద్యోగం విలయతాండవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రభుత్వమున్నా ఏమున్నది గర్వకారణం- నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించడంలో వారి విద్యార్హతకు తగ్గ ఉద్యోగం కల్పించడంలో మాత్రం పాలకులు ఘోర వైఫల్యం చెందుతూనే వుంది. కొత్త పరిశ్రమలను ఏర్పాటుచేసి వాటి ద్వారా చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి వున్న పరిశ్రమలే సమస్యల వలయంలో చిక్కుకొని మూతపడుతుంటే వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం మన ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి, నిర్లక్ష్యానికి ఓ నిలువుటద్దం, మచ్చుతునక. మరోవైపు ఎలక్షన్ల ముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం. మీ జీవితాలలో వెలుగులు నింపుతాం అని వాగ్దానం చేసి ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వున్న పరిశ్రమలలోనే రాజకీయాలు నడిపి కాసులు దండుకొని ఆ పరిశ్రమల, ఫ్యాక్టరీల వునికినే ప్రశ్నార్థకం చేసే దగుల్బాజీ, మోసపూరిత వ్యక్తిత్వంతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్న వైనం చాలా హాస్యాస్పదమైన, సిగ్గుచేటైన విషయం. ఇలా ఏవిధంగా చూసినా చదువుకున్న పేద, మధ్యతరగతి యువత తమ పొట్ట నింపుకోవటం, తనకున్న విద్యతో, డిగ్రీలతో తన కుటుంబ సభ్యులను పోషించుకోవటం కూడా గగనకుసుమంగా పరిణమించడం అత్యంత బాధాకరం. ముందు వెనుక ఏమీ లేని చదువుకున్న నిరుపేద, మధ్యతరగతి యువత ఎటు పాలుపోలేని స్థితిలో వ్యవసాయ కూలీలుగా, ఆయా పరిశ్రమలలో కార్మికులుగా మారిపోయే దారుణ పరిస్థితులను కల్పించుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ నిరుద్యోగ సమస్య మూలాన యువత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమను చదివించిన తల్లిదండ్రులకు సరైన న్యాయం చేయలేక సతమతమవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏదైనా జీవనోపాధి కల్పించేలా సత్వరమే చర్యలు తీసుకోవాలి.
-బుగ్గన మధుసూదన్‌రెడ్డి
బేతంచర్ల, కర్నూలు జిల్లా