ఉత్తరాయణం

అందరికీ స్వాతంత్య్ర ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక- డెబ్బయి రెండేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చింది. సామాన్యుడు ఆశించే కనీస అవసరాల్ని ఏ మేరకు సమకూర్చామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు స్వా తంత్య్రం అంటే- ఆలోచనల అగడ్తల్ని అధిగమించడం, ఆచరణాత్మక పథంలో పురోగమించడం, అట్టడుగు వ్యక్తికి వౌలిక సౌకర్యాలు అందించడానికి నిర్మాణాత్మక కృషిచెయ్యాలని సంకల్పం చెప్పుకోవడం. అధికార పగ్గాలు ఒక చేతి నుంచి మరో చేతికి మారడమే స్వాతంత్య్రమనుకొనే దశ అంతరించిపోయింది. ఏ దేశంలోనైనా ప్రజలు తమ సాంస్కృతిక మూలాల్ని పరిరక్షించుకొంటూ, అభివృద్ధి పథంలోకి ప్రయాణించడానికి స్వపరిపాలన ఎంతయినా అవసరం. ఆటవిక స్థితిలో ఏకాకిగా సంచరించిన మనిషి ఆ తర్వాత సామూహిక జీవనంలోని ప్రయోజనాల్ని గుర్తించాడు. కలసి జీవించడం అనివార్యమని గ్రహించాడు. మనుషులు గణాలుగా ఏర్పడ్డారు. నాయకులూ పుట్టుకొచ్చారు. పార్టీలూ ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. సామూహిక జీవితాన్నీ, సంఘ జీవనాన్ని ప్రభావితం చేసే అనేక వ్యవస్థలూ రూపుదాల్చాయి. తెర మీద ఒక దాని వెంట ఒకటి చకచకా కదిలే సన్నివేశాల్లా చారిత్రక యవనిక మీద దశాబ్దాల పాటు అవి తమ ఉనికిని ప్రదర్శించి, కాలం చెల్లగానే తెరమరుగయ్యాయి. వాటన్నింటిలోనూ అత్యుత్తమమైన ‘ప్రజాస్వామ్యం’ మాత్రం సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. స్వేచ్ఛ, సమానత్వం తలెత్తుకుని ధైర్యంగా జీవించే అవకాశం, నమ్మిన మార్గంలో నడిచే సౌలభ్యం, వివక్షకు తావులేని సాంఘిక న్యాయం వీటన్నిటితో పాటు ప్రతి వ్యక్తి ప్రాథమికంగా కోరుకునే కనీస వసతులు పరికల్పన లాంటి లక్షణాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలని, ఇవి కలకాలం నిలచే మూలస్తంభాల్లాంటివని అనేకులు అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రవచిత లక్ష్యాన్ని సాధించే అత్యుత్తమ మార్గమే తప్ప అంతిమ ధ్యేయం కాదన్న సంగతి స్పష్టమవుతోంది. మహత్తర కాంక్షతో నిర్దేశిత గమ్యాలకు చేర్చగలదని విశ్వసించిన మార్గం వక్రగతులు పడితేనో, వ్యతిరేక దిశలో ఉపమిస్తేనో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనేక రాజకీయ వ్యవస్థల ఉత్థాన పతనాల ద్వారా ప్రపంచం గ్రహించింది. డెబ్బయ్ రెండేళ్ళ క్రిందట స్వాతంత్య్రాన్ని సంపాదించినపుడు మన దేశానికి సరిపడే రాజకీయ, పాలన వ్యవస్థల్ని మనం నిర్మించుకొన్నాం. దీన్ని తులనాత్మకంగా విశే్లషిస్తే అత్యంత ప్రాథమిక లక్ష్యమైన ‘సగటు మనిషి’ తాలూకు కనీస అవసరాల్ని నెరవేర్చడంలో మనం, మన ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని సాధించిన ప్రగతి మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుంది. అప్పుడే కనీస అవసరాలు దరిచేరుతాయి. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయ.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660
కార్యాచరణతో సమస్యలకు మోక్షం
మోడల్ స్కూళ్లలో సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి, తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేయడం శుభసూచకం. 2015లో కేంద్రం నుండి రాష్ట్రాలకు బదలాయించిన మోడల్ స్కూళ్ల నిర్వహణ విధానంపై గత ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యలకు ముగింపు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం మోడల్ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసి, అన్ని సదుపాయాలు కల్పించేందుకు తగు ప్రతిపాదనలు పంపాలని సర్క్యులర్ పంపడం ఆనందదాయకం. కాగా, వివిధ జిల్లాల్లో మోడల్ పాఠశాలల నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. కారుణ్య నియామకాలు జరగక పోవడం, వేతన సవరణ అమలుకాక పో వడం జీతాల చెల్లింపులో సాంకేతిక అవరోధాలు కొనసాగడం, పెన్షన్ స్కీంలో భాగస్వామ్యం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం మంచి పరిణామం. అయితే, ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో సమస్యల పరిష్కారానికి తగు కార్యాచరణను అమలు చేయాల్సి ఉంది.
-బి.సురేష్, శ్రీకాకుళం