Others

గాంధీజీ అందరివాడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గాంధీజీపై మోదీజీకి రోజురోజుకీ మోజు పెరిగిపోతోంది. రేప్పొద్దున గాంధీ టోపీలు కూడా పెట్టుకోమంటాడేమో?’’ అన్నాడు మార్నింగ్ వాక్‌లో ఓ పెద్దాయన. ‘‘గాంధీ టోపీలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఎండాకాలం అయితే చల్లగా- శీతాకాలం అయితే వెచ్చగా వుంటుంది-’’ అంటూ తన బట్టతలను తడుముకున్నాడు ఆయన స్నేహితుడైన రిటైర్డ్ గవర్నమెంటు ఆఫీసరు.
‘‘క్యాలండర్‌పై గాంధీ యిలా కూర్చుని యించక్కా రాట్నం ఒడుకుతున్న బొమ్మని ప్రక్కన పెట్టుకుని- తాను కూర్చుని రాట్నం పట్టుకున్న పోజులో ఖాదీ సందేశం యిచ్చిన మోదీజీ ఏమైనా చేస్తాడు’’- అన్నదో స్కూలు టీచర్. అంటే గాంధీజీని నెత్తిన ఎత్తుకోడం అంటే అదేమైనా నేరమా? ఘోరమా? పాపమా? నిత్యం మనం పడుతూ లేస్తూ- మధుమేహం వున్న పాపానికి, యిట్లా రోడ్లుపట్టి నడక సాగించడం లేదా? గాంధీ చెప్పాడుట- ‘సొతంత్రం రాగానే యింక కాంగ్రెస్ పార్టీకి పనేముంది? దాన్ని అటకెక్కించండి’ అని. కానీ మనవాళ్లు వినలేదుట. దీనిమీద ఓ జర్నలిస్టు ‘హహ్హహ్హా’ అని నవ్వాడు.
గాంధీ ఆనాడు ఆమాట చెప్పారో లేదో గానీ ఇవాళ మోదీజీ ‘‘-ఆ పని నాకు వదిలేయండి. కాంగ్రెస్‌ను నేను కొంచెం కొంచెం అలా అలా రద్దుచేసేస్తానంటున్నాడు’’ అంటూ- ‘వాకర్స్’ ‘టాకర్స్’ కలిసి మాట్లాడుకుంటూ- దట్టమైన, వానపడని మేఘాల కింద నిత్యపాదయాత్రని కొనసాగిస్తున్నారు.
అసలు సందర్భం ఏమిటంటే మహాత్మాగాంధీ 1930లో చేసిన ఉప్పు సత్యాగ్రహం లాంటిది ఏమైనా చేస్తారా? అమిత్ షా ప్రభృతులు? కాదు.. కాదు- నరేంద్ర దామోదరదాస్ మోదీ- మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ నూట యాభయ్యవ జయంతిని- ‘పాదయాత్రల మయం’గా, దేశమంతటా ‘నడక సందేశం’ అందేలాగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
‘‘అట్లాగా? అమిత్‌షాకి కొంచెం ‘సిరిబొజ్జ’ వున్నట్లుంది. నడక సాగించగలడా?’’ అంటే- హోమ్ మినిస్టర్ అంటే ఏమిటండీ మరి? హోమ్ హోమ్‌కీ వెళ్లి- ‘‘రుూ యింట్లో కాంగ్రెస్ వాళ్లున్నారా?’’ అనడగాలి. ఆనక మిగతా పని మోదీజీ చూసుకుంటాడు.
‘‘ఇదేంటయ్యా బాబూ! మాటిమాటికీ కాంగ్రెస్ పార్టీ మీద పడతావ్? మోదీజీ తన పార్టీ ఎంపీల సమావేశంలో- ‘‘వాళ్లందరూ గాంధీ జయంతినాడు మొదలుపెట్టి సర్దార్ పటేల్ జయంతి అక్టోబర్-31, దాకా - తమతమ నియోజకవర్గాలలో పాదయాత్ర చెయ్యాలని’’ హుకుం నామా జారీ చేశాడు. ప్రతి ఎంపీ రోజుకో పదిహేను కిలోమీటర్లకు తక్కువ కాకుండా, మొత్తం మీద నూటయాబై కిలోమీటర్ల ‘వాకింగ్’, అది చేస్తున్నప్పుడు ‘టాకింగ్’ కూడా చెయ్యాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ వార్తని కావాలనే బయటికి ‘లీక్’ చేశారు. భాజపా వర్గాలలో దీనిపై ‘రియాక్షన్’ఎలా వుంటుందో? పైగా, మోదీ తన ‘మన్‌కీ బాత్’ అనగా- మనసులో మాటగా- గాంధీజీ బోధలనూ వాటితోపాటే తలా ఒకటో, రెండో లేదా తలా ఓ డజనో మొక్కలను- ‘గట్టిగా’ ప్రజల మధ్య నాటమన్నాడు. దీనికి అమిత్‌షా ఏమన్నాడంటే- ఏమిటంటాడు? ఇప్పుడాయన ‘్భజపా బాదుషా’ కాదుకదా? మంత్రివర్గంలో ఒక మినిస్టర్.
ఈ విధంగా గాంధీజీని మోదీ ‘హైజాక్’ చేసేశాడు. సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ని ఏనాడో ఎత్తుకుపోయి మేఘాలను పర్యవేక్షించమని అంతెత్తు విగ్రహంగా నిలబెట్టాడు. మొదటి నుంచీ యింతేనా? మోదీజీ రుూమధ్యనే మొదలెట్టాడా? అంటే- 2014లోనే మన ప్రధానమంత్రి అయిన ఆయన మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు- అక్కడ గాంధీ బోధలు ఎంత అవసరమో వాళ్లందరికీ చెప్పాడు. చెప్పడమేనా? రెండున్నర మీటర్ల ఎత్తున్న గాంధీ మహాత్ముడి కంచు విగ్రహాన్ని ప్రతిష్ఠ కూడా చేసాడు. ‘‘కంచు విగ్రహమే ఎందుకు?’’ అంటే.. వాన కురిసినా, మంచు కురిసినా- చెక్కు చెదరనిది కంచు విగ్రహమేగా?
ఏతావతా- చెప్పవచ్చేదేమిటీ అంటే- భాజపా ఎంపీలంతా పాదయాత్రలు- గాంధీ జయంతి సందర్భంగా చేపట్టాలి. అందులోనే- ‘సబ్ కా వికాస్’ వుంది. ప్రపంచంలో యిప్పుడు ముగ్గురు ‘గుజరాతీ’లు గ్రేట్! ఒకరు శ్రీమాన్ దామోదర్‌దాస్ మోదీజీ, మరొకరు ఆయన ప్రమోట్ చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్. ఈ యిద్దరికీ, మిగతా అందరికీ పైన మహాత్మాగాంధీ సహా ‘ద గుజరాతీ వాలా’’లు. మోదీజీ రుూ విధంగా చెయ్యడానికి కారణం అపార్థం చేసుకోకండి. గాంధీజీ బోధలు, యివాళ రుూ ఉగ్రవాద ప్రమాద కాలంలో- పర్యావరణ ఉష్ణోగ్రతలవల్ల వస్తున్న హాని కాలంలో ఎంతో ‘రిలవెంట్’- అనగా ఎంతో అవసరమైనవి.
‘‘ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్లు ‘హై జాక్’ అన్న మాట వాడటం తప్పు. ఎందుకంటే గాంధీ ఏమీ కాంగ్రెస్ అబ్బసొమ్మేం కాదు. ఆయన అందరివాడూ. ఏ పార్టీకో నిబద్ధుడు కాదు. చీటికీ మాటికీ బుద్ధవిగ్రహం పెట్టేస్తూంటారు మాయావతి లాంటి కొందరు అమాయకులు. కాదు- పార్కులలో సిమెంటు బొమ్మలు గానే (కొన్నిచోట్ల మాత్రమే) వుండిపోయిన గాంధీ విగ్రహాలను కంచు విగ్రహాలుగా మార్చాలి. ఆ పనిని కాంగ్రెస్ పార్టీయే చెయ్యాలి’’ అంటూ ఒక ఓల్డ్ కాంగ్రెస్ వాలా- ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మెట్ల మీద కూర్చుని లెక్చర్ దంచేస్తూ వుంటే-
‘‘బాబ్బాబూ! అంత మాటనకు.. అసలే ఫండ్స్ లేవు- రిఫండ్స్ లేవు- కాంగ్రెస్ పార్టీ దగ్గర. ‘మూలిగే నక్క మీద తాటిపండు’ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చేతి చమురు బాగోతాలు అంటగట్టకు’’ అన్నాడు. ఆ ప్రక్కనే ‘యోగ’ చేస్తున్న మిడిల్ ఏజ్డ్ ప్రొఫెసర్ ఒకడు. ఇంతకీ, స్వచ్ఛ భారత్ ఉద్యమం మోదీజీ- గాంధీ జయంతి నాడే ప్రారంభించిన సంగతి జ్ఞాపకం లేదా? రెండోసారి ప్రధానమంత్రిగా, ఆసేతు హిమవన్నగమూ- ‘‘్థంపింగ్’’గా గెల్చిన నరేంద్ర మోదీ వెంటనే అన్నమాటలేమిటీ?
బై ది బై- ‘్థంపింగ్’.. అనగా బల్లలు చరుస్తూ గెలవడం అన్నమాట. ఆయన ఏమన్నాడు? ‘దీనదయాళ్, రామమనోహర్ లోహియా, మహాత్మాగాంధీలే మనకి త్రిమూర్తులు’- అన్న తాత్పర్యంలో ఉద్ఘాటించలేదా? అసలు గుజరాతీ అన్న అభిమానం ఒక్కటే కాదు గాంధీజీ మీద ప్రజలలోకి ‘జాతిపిత’ పేరుని ‘పంపింగ్’ చెయ్యడం విషయంలోనూ మన ప్రధాని ముందున్నాడు. తనముందు- ఒకటి- గాంధీ పుట్టినరోజు- అందులోనూ నూట యాభ్భయ్యవ పుట్టినరోజూ- రెండు- దేశ స్వతంత్ర దినోత్సవానికి డెబ్భయి అయిదో జయంతి (2022లో) ఘనంగా చెయ్యాలన్న పవిత్ర ధ్యేయాలున్నాయని చెబుతూ- త్వరలోనే ప్రపంచ పారిశుధ్య మంత్రులందరినీ పిలిచి, మహాసభలు కూడా మన దేశంలోనే నిర్వహిస్తామని ఆయన ఉద్ఘాటించాడు.
మనకేం? ఆంధ్రాలో కమలం లేదా ‘కమలనాథులు’ అనదగ్గ ఎం.పీ.లు లేరు. అంతా- జగమంతా ‘‘జగన్ మోహనం’’ అంటూ బెజవాడ నుంచి తే.దే.పా. మాజీ సభ్యుడొకరు దుఃఖపడ్డాడు.
ఎంపీలు- అంటే లోక్‌సభ సభ్యులు లేనిచోట- రాజ్యసభ సభ్యులు రుూ నడక మధ్యలో ‘మొక్కలు’నాటడం- చేస్తారని భాజపా బాస్ మోదీ వివరించారు. ‘‘అద్సరే, యిలా మొక్కలు నాటేస్తారు- కోట్ల కొలదీ మొక్కలు గానీ, మర్నాటి నుంచీ సదరు పిల్లమొక్కలకి నీళ్లెవరు పోస్తారు?’’ నారుపోసిన వాడే నీరు పోస్తాడు అన్న సామెత వుంది గానీ, అది మన ఎంపీలకు వర్తిస్తుందా? దేవుడికి వర్తిస్తుంది గానీ. అంచేత స్థానిక మ్యునిసిపాలిటీలకు రుూ పనిని అప్పగిస్తే ఎలా వుంటుంది?’’ అన్నాడు ఒక లోకల్ భాజపా అభిమాని.
‘‘నువ్వు పొయ్యి- లేకపోతే మాట్లాడకు’’ అన్నాడు కాంగ్రెస్ పార్టీ అభిమాని. అది కాదండీ, బాబూ! ఇప్పుడు గాంధీ బోధలేంటి? అవిప్పుడు అర్జెంటుగా ఎందుకు తెలుసుకోవాలి. ఎంపీలూ, ఎమ్‌ఎల్‌ఏలూ వగైరా కమలం పార్టీలోని అందరూ? అన్నీ బాగున్నాయి గానీ, నార్త్‌లో అనగా ఉత్తరాదిన అక్టోబర్ నెల గొప్ప చలిగా వుంటుంది. ‘‘ఈవ్నింగ్ వాక్’’ బెటరేమో? అయినా, ‘‘మార్నింగ్ వాక్’’ అనలేదు మన పిఎమ్. ‘‘పాదయాత్ర’’ అన్నారంతే. అది ‘మిట్టమధ్యాహ్నం’ అయినా- నో ప్రాబ్లెమ్.. అదీ సంగతి!
గాంధీ ‘టాక్’ అండ్ గాంధీ ‘వాక్’ ఆర్ రిలవెంట్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512