ఉత్తరాయణం

ఏపీ సీఎం నిర్ణయం భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సైట్ తవ్వకాలను అనుమతించిన పాత జీవోను రద్దుచేస్తూ, ఇక ముందు తవ్వకాల్ని అనుమతించబోమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. గిరిజనులకు, పర్యావరణానికి మేలుచేసే నిర్ణయం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. బాక్సైట్ తవ్వకాలు మన్యప్రాంతాన్ని నీరు నిలవని ఎడారిగా మార్చడమేకాకుండా, గిరిజనుల్ని జీవనోపాధికి దూరం చేస్తాయి. ఏవో కొన్ని ప్రయివేట్ సంస్థలకు లాభం చేకూర్చి, సమాజానికి మాత్రం తీరని నష్టాన్ని మిగులుస్తాయి. గిరిజనం వాటిని వ్యతిరేకించేది అందుకే. బాక్సైట్ తవ్వకపోవడం వల్ల గిరిజనులకు వచ్చిన నష్టమేమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఏజెన్సీలో ఖనిజాలను తవ్వడం వల్ల తీరని నష్టం ఉంది. వైకాపా మేనిఫెస్టోకి అనుగుణంగా, మన్యప్రాంతపు ఆకాంక్షకు అద్దం పట్టేలా సీఎం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ముందుముందు ఇదే స్ఫూర్తితో గిరిజన సమస్యల పట్ల జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న నమ్మకానికి ఇది నాంది పలికే చర్య. ముఖ్యంగా అటవీ హక్కుల విషయంలో ఆదివాసీలకు అన్యాయమే మిగిలింది. దాదాపు అరవైఆరు వేల దరఖాస్తులు అనుమతికి నోచుకోక వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితులున్నాయి. నిరాకరింపబడిన దరఖాస్తుదారుల్ని వారి భూములనుండి బయటకు పంపేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆ తీర్పుపై స్టే ఉన్నప్పటికీ ప్రమాదం పొంచి ఉన్నట్లుగానే భావించాలి. అటవీ హక్కుకై దరఖాస్తుచేసుకున్న వారిపట్ల, అపీల్ చేసుకొనే వారి పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో, వాస్తవిక దృక్పథంతో స్పందిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఆ తరహా ధోరణి అవసరమన్నది అధికార గణానికి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి అటవీ హక్కుల విషయమై మరింతగా చొరవ తీసుకోవాలి.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం