ఉత్తరాయణం

మంఢుటెండల్లో జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత వేసవిలో భానుడు నిప్పులు చెరగడంతో ప్రజలు నానా బాధలు పడుతున్నారు. అప్పుడే 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ముందుముందు ఎలా ఉంటుందో? ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకుపోవద్దు. వడదెబ్బబారిన పడకుండా రక్షణ చర్యలను తీసుకోవాలి. మండుటెండలలో కూలిపనులకు విరామం ఇవ్వాలి. ప్రైవేట్ పాఠశాలలు కాన్వాసింగ్ పేరుతో ఉపాధ్యాయులను తిప్పవద్దు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్ఫుడ్స్ జోలికి వెళ్లవద్దు. తప్పనిసరిగా నిమ్మరసం, కొబ్బరి బోండాలు, తాటి ముంజెలు, పుచ్చకాయలు వంటి చలువ చేసే పదార్థాలను తీసుకోవాలి. చలివేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలి. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-శ్రీశ, భువనగిరి
*
ఈ పేజీకి లేఖలు, రచనలు
పంపాల్సిన చిరునామా:
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్డు,
సికిందరాబాద్- 500 003.
ఈ-మెయిల్: editpage@andhrabhoomi.net