ఉత్తరాయణం

ఉపాధి రద్దు పథకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు పథకం ఉన్న ఉద్యోగాల్ని ఊడబెరికి, దేశ ఆర్థిక వ్యవస్థపై మెరుపుదాడిగా తయారైంది. ఆ అర్ధరాత్రి ఆయన వేసిన బాంబు- ప్రకటిత లక్ష్యాలైన నల్లధనం అరికట్టడం, నకిలీ నోట్లు ఆపడం లాంటి వాటికి ఆమడ దూరంలో పడి సజావుగా నడుస్తున్న ఆర్థిక రంగాన్ని మాత్రం విచ్ఛిన్నం చేసింది. తాజాగా బెంగళూరుకు చెందిన అజీమ్‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనం ప్రకారం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 50 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. అంటే అర కోటి కుటుంబాలకు ఆర్థిక ఆసరా పోయింది. ఉన్న నిరుద్యోగితకు ఇది అదనం. ఈ లెక్కల్లో మహిళా ఉద్యోగాల్ని లెక్కించలేదట! అవికూడా సమగ్రంగా లెక్కిస్తే ఫలితాలు అనూహ్యం. నగదు రద్దుకూ, పోయిన ఉద్యోగాలకు లంకె తెలియడం లేదని నివేదిక చెప్తున్నా, అనూహ్యంగా అప్పటినుండి ఉద్యోగాలు పెద్దఎత్తున పోవడం, పోయినవి అన్ని స్థాయిల్లో ఉండడం కారణాన్ని చెప్పకనే చెప్తోంది. ఆర్థికవేత్తల అభ్యంతరాల్ని, రిజర్వ్ బ్యాంకు అనుమతిని పట్టించుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ స్థాయిలో బెడిసికొట్టినా అధికార పక్షం వితండవాదం వదలక పోవడమే అసలు సమస్య. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్మికుల ఉపాధికి అవకాశాలు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థ దివాలాను తెలియబరిచేదే. ఈ సంవత్సరం దేశం నిరుద్యోగితలో 45 సంవత్సరాల్లో ఎరుగని సంక్షోభం చూస్తుందని అధికార నివేదికలే చెప్తున్నాయి. యువత అధికంగా ఉన్న భారత్ ఉన్న వనరులతో బలీయమైన శక్తిగా ఎదిగేమార్గాల్ని చూడాల్సిన సమయంలో అందుకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకొనే విధానాల్ని అవలంబిస్తే అది దేశద్రోహమే. రాబోయే ప్రభుత్వం సరైన విధానాల్ని ఎంచుకొనేలా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. అన్నిపక్షాలూ ఉద్యోగ కల్పన, ఉపాధి హామీల్లో నిర్దిష్ట విధానాల్ని ప్రకటించేలా వత్తిడి తేవాలి. ఈ సందర్భంగా ఒక వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావించాలి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో తిరిగినపుడు, తమను ఉపాధి పనుల్లోకి రానివ్వడం లేదంటూ కొంతమంది చెప్పారు. వారు కొత్తగా పట్టణ పరిధిలో చేరడమే దీనికి కారణం. పట్టణంలో చేరడం వల్ల పన్నులు పెరగడంతోబాటు ఉన్న ఉపాధి హామీ కోల్పోవడం అదనం అన్నమాట. పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ ఉండాల్సిన అవసరం తెలిసింది. ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాల్సిన విషయమిది.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం