ఉత్తరాయణం

కుల రిజర్వేషన్లు దేశానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులపరమైన రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలాడే పార్టీలు దేశానికి ప్రమాదకరం. కులం పేరిట రిజర్వేషన్లు దేశంలో ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లో ఐకమత్యాన్ని లేకుండా చేయడానికే రిజర్వేషన్లను మన నాయకులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. కొన్ని కులాలకు కొంత కాలం రిజర్వేషన్లు కొనసాగించి, ఆ తర్వాత రద్దుచేయమని భారత రాజ్యాంగంలోనే డా.బి.ఆర్.అంబేద్కర్ సెలవిచ్చారు. బీద కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని కొంత కాలముంచి, ఆ తర్వాత వాటిని తొలగించాలి. రిజర్వేషన్ల వల్ల కులాల పేరిట దేశ ప్రజల్లో విభేదాలు పొడసూపుతాయి. ఇదే రాజకీయ పార్టీలకు కావాలి. ‘విభజించి పాలించు..’ సిద్ధాంతమిదే! మన రాజ్యాంగం నుండి కులాన్ని, మతాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలోను మనకున్న లోపాల మయమైన రాజ్యాంగం లేదు. ప్రజలందరూ సమానమనే రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవాలి. భారతదేశానికి ‘కులాతీత, మతాతీత రాజ్యాంగం’ ఉండాలి. దేశ ప్రజలు ఐకమత్యంగా వుండాలంటే మన రాజ్యాంగాన్ని తిరగ వ్రాయాలి. మన రాజకీయవేత్తలు పదవుల కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దేశ ప్రజలందరినీ సమానంగా చూడాలనే రాజకీయ పార్టీనే ప్రజలు ఎన్నుకోవాలి. అలాకాకపోతే దేశం భ్రష్టుపడుతుంది. దేశ ప్రజలను కీలుబొమ్మలను చేసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే రాజకీయ పార్టీలను జనం తరిమికొట్టాలి. ప్రస్తుత తరుణంలో ఇదే దేశానికి ముఖ్యం.
- జి.శ్రీనివాసులు, అనంతపురము