ఉత్తరాయణం

ప్రజాసంక్షేమానికి విరుద్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవో నెంబర్ 562 ద్వారా ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం-2018, భూసేకరణ చట్టం-2013లను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజా సంక్షేమానికి విరుద్ధం. ప్రజల నుంచి బలవంతంగా భూములను గుంజేయడానికి ఈ చట్టసవరణలు పాశుపతాస్త్రంలా పనిచేస్తాయి. ‘్భసేకరణ చట్టం-2013’కు గ్రామసభల నిర్వహణ, ప్రజల సమ్మతి అత్యంత కీలకం. ప్రస్తుత సవరణతో ఆ వెసులుబాటు ప్రజలకు లేకుండా చేశారు. కేంద్ర భూసేకరణ చట్టంలో అత్యంత కీలకమైన సామాజిక సర్వే, ఆహార భద్రతకు ఉద్దేశించి సెక్షన్-2,3ల నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా రైతులపాలిట శరాఘాతమే. నిర్వాసితుల హక్కులకు భంగం కల్గించే సవరణలతో బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అష్టకష్టాలు పడిన కేంద్ర ప్రభుత్వం, విపక్షాల నుండి మద్దతు లభించనందున, తగురీతిన ఆ చట్టసవరణలు చేసుకునే హక్కును రాష్ట్రాలకు బదలాయించింది. గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు వెంటనే చట్టసవరణలు చేయడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో మిగతా రాష్ట్రాలు వెనుకడుగువేసాయి. కాని అభివృద్ధి సాకుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యుత్సాహంతో చేసిన భూసేకరణ చట్టసవరణలపై ప్రజలనుండి ఆగ్ర జ్వాలలు ఎదురయ్యాయి. చట్టసవరణలపై ఆ రెండు ప్రభుత్వాలు పునరాలోచించడం అత్యావశ్యకం. రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించే టిడిపి ప్రభుత్వం అదే ప్రభుత్వం ఆదేశాలకు తలొగ్గి నయవంచక భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందంటే వీరి ఆర్థిక విధానాల్లో ఎలాంటి తేడాలేదన్నది సుస్పష్టం. ఇక రైతుల పక్షపాతిని అని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ వివాదస్పద జివోపై నోరుమెదపడం లేదంటే ప్రజావ్యతిరేక విధానాలలో రెండు పార్టీల వైఖరి ఒక్కటే అని అర్థం అవుతోంది. చట్టప్రకారం ‘అమ్మకం’ అనే పదాన్ని భూసేకరణ నోటిఫికేషన్లలో ఎక్కడా పేర్కొనరాదని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ఏకంగా నాలుగు పర్యాయాలు ‘అమ్మకం’ అనే పదాన్ని ప్రస్తావించిందంటే ప్రభుత్వానికి చట్టాల పట్ల ఏమాత్రం గౌరవముందో బోధపడుతుంది. రైతులు కోర్టులను ఆశ్రయించేందుకు వీలులేకుండా చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. రైతుల అనుమతులతో సంబంధం లేకుండా వారి భూములను బలవంతంగా సేకరించే విధానం ప్రపంచంలోనే ఎక్కడాలేదన్న సామాజిక, ఆర్థిక శాస్తవ్రేత్తల అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వాలు సదరు చట్టసవరణలను రద్దుచేయాలి.
-ఎం.కనకదుర్గ, తెనాలి

అసమ్మతులు సహజమే..
ఏ రాజకీయ పార్టీలోనైనా అందరికీ సీట్లు ఇవ్వటం సాధ్యపడని అంశం. సీట్లు తక్కువ, పోటీ ఎక్కువగా ఉంటుంది గనుక ఆశావహులందరినీ సంతృప్తిపరచలేరు. టిక్కెట్ ఆశించి భంగపడినవారు వేరే పార్టీల వైపు వెళ్లడం సహజం. పొత్తుల ఫలితంగా కొందరికి న్యాయం జరగకపోవచ్చు. అధికార పార్టీని దించాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు ‘త్యాగాల’కు వెనుకాడకూడదు. ఒకరిని ఒకరు మోసం చేసుకుని ఓట్లు బదలాయించకుంటే నష్టం అధికార పక్షానికి కాదు. ‘కూటమి’కే ఉంటుంది. ఎన్నికలు పోటాపోటీగా ఉన్న సందర్భాలలో అలకలు, ఫిరాయింపుల వల్ల సంబంధిత పార్టీలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. లక్ష్యసాధనతో పనిచేసి విజయం సాధిస్తే పదవులు ఏదో రూపేణా వస్తాయని ఆశించాలి. మహాకూటమి ఏ లక్ష్యంతో ఏర్పడిందో అందుకోసం నేతలు కృషి చేయాలి. అన్ని పార్టీలూ గెలుపుపై ధీమాగా వున్నా ఫలితాలు అంతు చిక్కనివిగా ఉంటాయి.
-అయినం రఘురామారావు, ఖమ్మం

బాబు యాత్రలు దేనికి?
ఏపీలో ప్రజలు ఒకపక్క స్వైన్‌ఫ్లూ లాంటి అంటువ్యాధులతో, మరోవైపు అనావృష్టితో బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల్ని గాలికొదిలేసి రాజకీయ యాత్రలు చేస్తుండటం శోచనీయం. కేంద్రంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భాజపా యేతర పార్టీలను ఏకం చేస్తానని ఆయన బెంగళూరు, చెన్నై, కోల్‌కత తదితర నగరాలకు వెళ్లడం ఎందుకో అర్థం కావడం లేదు. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్‌లు ఇప్పటికే భాజపాకు వ్యతిరేకంగా పొత్తును కొనసాగిస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే పార్టీ ఎన్నో ఏళ్ల నుంచీ కాంగ్రెస్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. అటువంటప్పుడు చంద్రబాబు తన రాష్ట్ర పరిపాలనను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల సాధించేది ఏముంటుంది? బహుశా రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గెలిస్తే కాంగ్రెస్‌ను కాదని తనకే ప్రధాని పదవి ఇవ్వాలని కోరడానికా? చంద్రబాబుకి నిజంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలనే కోరిక ఉంటే బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి దగ్గరకు వెళ్ళి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌తో బిఎస్పీ జత కట్టేలా చేసి ఉండవచ్చు కదా?
-టి.సంతోష్‌కుమార్, అనపర్తి