ఉత్తరాయణం

తుఫాన్ తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలుత- తితిలీ తుఫాన్
తీరం దాటింది
మా బతుకుల్నీ, పంటల్నీ
ఫలహారం చేసింది.

పిదప- రాజకీయ ‘అల్ప’పీడనం
మమ్మల్ని చుట్టుముట్టింది
మా వెతల్ని పరిహాసం చేస్తోంది.

మోకాళ్ళ లోతు మొసలి కన్నీళ్లలో
మునిగి ఉన్నాం
కాస్తా పక్కకు తప్పుకుంటారా...
చెదిరిన మా గుండెల్ని
ఇక సరిచేసుకోవాలి...
-డాక్టర్ డి.వి.జి.శంకరరావు, విజయనగరం