ఉత్తరాయణం

‘మీటూ’తో నిర్భయత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ విదేశాల్లో ఇప్పుడు మహిళలు చేపట్టిన ‘మీటూ’ ఉద్యమం ప్రత్యేకమైనది, అభినందనీయమైనది. సినిమా, మీడియా, పరిశ్రమలు.. ఇలా ఏ రంగంలోనైనా అక్కడ పనిచేసే మహిళలకు వేధింపుల నుండి మినహాయింపు లేదు. అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో ఈ జాఢ్యం వేళ్ళూనుకొనడానికి ఎన్నో కారణాలున్నాయి. బాధిత మహిళ నోరు తెరచి చెప్పుకోలేదులే అన్న ధీమాతో వేధింపులకు పాల్పడేవారు బరితెగిస్తున్నారు. తప్పుచేసే ఉద్దేశం వాళ్లకుండడం ప్రధాన కారణం. పురుషాధిక్య వాతావరణంలో లైంగిక వేధింపులు జరపడం వీరోచితంగా భావించడం, బాధిత మహిళపై చూపాల్సిన న్యాయ దృష్టి కొరవడడం ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ఏటా మన దేశంలో వేలాది లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. వాస్తవ సంఖ్య అంతకు పదిరెట్లు కనీసం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ‘విశాఖ తీర్పు’ ఆదేశాలను అన్ని సంస్థలూ పాటించాల్సి ఉంది. లైంగిక వేధింపుల నియంత్రణ, నిషేధం, బాధితులకు ఊరట కల్పించే వాతావరణం ఉండాలి. ఆ తరహా నేరస్థుల్ని శిక్షించడానికి చట్టం కూడా ఉంది. అయితే బాధితులు నోరు విప్పి ధైర్యంగా చెప్పగలిగే వాతావరణమే లేదు. ఇప్పుడు ఈ తరహా చైతన్యం వల్ల లైంగిక వేధింపులకు కొంతైనా అడ్డుకట్టపడే అవకాశం ఉంది. అన్యాయాన్ని ఎదిరించడంలో మొదటి మెట్టు- బాధితులు నోరు తెరవడమే, అసహనం చూపించడమే. అలా నిలదీయడానికి ఏ మాత్రం సందేహించకపోవడమే.
--డా డీవీజీ శంకరరావు, పార్వతీపురం

పాక్‌కు దీటైన జవాబు
పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు జవాబుగా భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని అయిదు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం సమంజసమే. భారత -పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య ఈనెలలో జరగాల్సిన భేటీని భారత ప్రభుత్వం రద్దుచేయడం సరైన చర్యే. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించటానికి, చిరకాల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఘనంగా ప్రకటించుకున్నాడు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి వారం తిరగకుండానే ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదులకు మనోధైర్యం పెంచేలా ప్రకటనలు చేశాడు. బిఎస్‌ఎఫ్ జవాన్ హత్య, కాశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఉగ్రవాదులను కీర్తిస్తూ పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం వంటి చర్యలకు పాల్పడడం ప్రారంభించాడు. సైన్యాధికారుల అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే తన ప్రభుత్వానికి మనుగడ కష్టం అని ఇమ్రాన్ చాలా త్వరగా అర్థం చేసుకొని అందుకనుగుణంగా తన అజెండాను మార్చుకున్నాడు. దశాబ్దాల తరబడి మన ప్రభుత్వాధినేతలు పాకిస్తాన్‌కు స్నేహహస్తం చాస్తున్నా, వారు మాత్రం భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎన్నోసార్లు ఉల్లంఘించింది. ఉగ్రవాద దుశ్చర్యలతో వందల సంఖ్యలో అమాయకులను, జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఎల్లప్పుడూ మన దేశాన్ని శత్రు దేశంగానే భావించే పాకిస్తాన్ ఉగ్రవాద పథం నుండి వైదొలగనంతవరకు భారత్ ద్వైపాక్షిక చర్చలను కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.
--సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం