రాష్ట్రీయం

మరో 14 లక్షల ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 19: నదుల అంతర్గత అనుసంధానం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 150 నుంచి 200 టిఎంసిల నీటిని వినియోగించుకుని తద్వారా 15 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టు పూడ్చడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అలాగే రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరవు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని కల్పిస్తామన్నారు. శనివారం ఆయన నీరు ప్రగతిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశామని, గోదావరి నుండి సముద్రంలోకి వెళ్లే సగటు వార్షిక ప్రవాహాలు మూడు వేల టిఎంసిలుగా ఉన్నాయని, రాష్ట్రాన్ని 736 భూగర్భ జల బేసిన్లుగా విభజించామని వివరించారు. రాష్ట్రంలో భూగర్భ జలాభివృద్ధి స్థితి 52 శాతంగా ఉందని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహితంగా తయారు చేయడం, ప్రభుత్వ దార్శనికతగా ఉందన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 199.04 లక్షల ఎకరాలని, ఇందులో కల్పించిన సాగు 101.17 లక్షల ఎకరాలని, గ్యాప్ ఆయకట్టు 33.21 లక్షల ఎకరాలన్నారు. మిగులు నుండి లోటు ఉన్న బేసిన్లకు నదుల అంతర్గత అనుసంధానం, అంతర్ అనుసంధానం చేయడమనేది నీరు-చెట్టు కింద రాష్ట్రాన్ని కరవు నుండి రక్షించే ఒక ప్రధాన చర్యగా ఉందన్నారు. నదుల అంతర్గత అనుసంధానం రాష్ట్రంలోని భూగర్భ జలాన్ని పెంచడానికి సహాయపడుతుందన్నారు. కాగా, జల వనరుల ప్రగతిపై ప్రాంతీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు డిసెంబర్ 24వ తేదీన విశాఖపట్నంలో, 26వ తేదీన అమరావతిలో, రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన అనంతపురంలో నిర్వహిస్తామన్నారు. పంట సంజీవని కింద సాగు కుంటలు తవ్వేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కింద ఏడు ప్రాజెక్టులను చేపడుతున్నట్లు చెప్పారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 1,2, పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల సాగునీటి పథకం, గాలేరు, నగరి సృజల స్రవంతి ఫేజ్-2, తోటపల్లి, గుండ్లకమ్మ రిజర్వాయర్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బిఆర్‌ఆర్ వంశధార స్టేజ్-2, ఫేజ్-2 ప్రాజెక్టులను చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు.
రూ. 8,124.37 కోట్ల నిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచినట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకమైన సమాధానం ఇస్తూ గత ఆర్థిక సంవత్సరం (2014-15) బడ్జెట్‌కు రూ. 3,210.49 కోట్లు, వ్యయం 3,910.74 కోట్లు అయిందన్నారు. అయతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్‌లో రూ. 4,678.13 కోట్లు, సవరించిన అంచనా రూ. 8,124.37 కోట్లు చేశామని చెప్పారు. ఇంతవరకు రూ. 5,721 కోట్లను ఖర్చుపెట్టామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రకారం పని పురోగతి వల్ల వ్యయం అంచనాల కంటే ఎక్కువైందన్నారు. (చిత్రం) దేవినేని ఉమామహేశ్వరరావు