సబ్ ఫీచర్

సవాలు విసురుతున్న ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుధైక కుటుంబమని మనం గర్వంగా చెప్పుకొనే ప్రపంచ దేశాలలో శాంతికరువై ప్రజలు అభద్రతాభావంతో మనుగడ సాగిస్తున్నారు. ఎప్పుడు ఉగ్రవాదులతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని మానవాళి భయావహ స్థితిలో అట్టుడికిపోతున్నారు. మతోన్మాదులైన జిహాదీలను మట్టికరిపించే విధానాలను కఠినతరం చేయాల్సిన అవసరం ప్రపంచ దేశాల ముందుంది. భారత్‌లోను, దక్షిణాసియాను ఇస్లాం మతం రాజ్య ంగా తీర్చిదిద్దుతామని, మత రాజ్యపతాకాలను ఎగురవేస్తామనే ఐఎస్‌ఐ ఎస్ తీవ్రవాద ముఠా హెచ్చరికల్ని భారత్ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ సందర్భంలో ఇరాక్, సిరియా ఇస్లాం మత రాజ్యంలో ఐఎస్‌ఐఎస్‌లో భారతదేశానికి చెందిన అనేక మంది యువకులు చేరుతున్నారనే సందేశాల్ని అనేక రోజులుగా నిఘా వర్గాలు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇరాక్ కేంద్రంగా ఐఎస్‌ఐఎస్ హింసాకాండను కొనసాగిస్తుండగా, ఆల్‌ఖాయిదా, జమాత్ ఉద్‌దావా కాని, ఆఫ్రికాలో బోకోహరామ్ , లెబనాన్‌లోని హిజ్‌బుల్లా, పాలస్తీనాలోని హామాస్, బంగ్లాదేశ్‌లోని హుజీ భారత్‌లో సిమిలు 20వ శతాబ్దంలో అంతరించిపోయిన ఇస్లామిక్ ఖలీఫావ్యవస్థను పునరుద్ధరించడానికి తీవ్రప్రయత్నం చేస్తున్నారు.
ఇస్లామేతరులు ఎక్కువ సంఖ్యలో ఉన్న భారతదేశం వారికి ప్రథమ శత్రువు. ఈ హింసావాదాన్ని, మతతత్వాన్ని, సైద్ధాంతిక స్ఫూర్తికి ప్రధాన కేంద్రం పాకిస్తాను కాగా, ప్రధాన ఆర్థిక సహాయ కేంద్రంగా సౌదీ అరేబియా అనుసంధానకర్తగా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నిఘా విభాగపు ముసుగులో ఐఎస్‌ఐ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా వ్యవహరిస్తోంది. ఖురసాన్ ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటును లక్షిస్తున్న ఐఎస్‌ఐఎస్ భారత్‌లోని గుజరాత్ సహా వాయవ్యప్రాంతం అంతా తమ అధీనంలోకి రావాలని తమ విస్తరణ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఉపఖండంవైపు దృష్టిసారించిన ఆల్‌ఖైదా బర్మా, బంగ్లాదేశ్, అస్సాం, గుజరాత్, అహ్మదాబాద్, కాశ్మీర్‌లపై దృష్టిసారించింది. రోజుకు సుమారు రూ.120కోట్ల రాబడితో ఆర్థికంగా బలపడుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు అన్నివిధాలుగా ఆయుధ సేకరణతో ఐఎస్‌ఐఎస్ ఫ్రాన్స్, యూకే, జర్మనీ వంటి దేశాలనుంచీ ఉగ్రవాదుల శిబిరాలకు రప్పించుకొంటూ భారత్‌పైనా దృష్టిపెట్టింది.
పదమూడేళ్ల క్రితమే కాశ్మీరును, చెచెన్యా, అఫ్ఘనిస్థాన్, బోస్నియాలతో పోల్చిన జవహరి గత ఏడాది కాశ్మీర్ విముక్తిపై ప్రకటనచేస్తూ యుద్ధం కొనసాగించాలంటూ కాశ్మీర్ ముస్లింలకు ఇచ్చిన సందేశంలో ఆప్ఘాన్‌నుంచి బలిదానవీరులు వచ్చి కాశ్మీర్‌కు స్వేచ్ఛ ప్రసాదించడం జరుగుతుందని ఆల్‌ఖైదా పాకిస్తాన్ విభాగ అధిపతి ఆసీం ఉమర్ చేత ప్రకటింపజేశాడు. పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్న ఆల్‌ఖైదా భారత్ ప్రధాని నరేంద్రమోదీని ఇస్లాం బద్ధ శత్రువుగా చిత్రీకరించి చెలరేగిపోయే ప్రమాదంకూడా పొంచి ఉందని అమెరికాకు చెందిన సీఐఏ మాజీ విశే్లషకుడు బ్రూస్‌రిడెల్ స్పష్టం చేస్తున్నారు. ఆల్‌ఖైదాతోపాటు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదాన్ని తక్కువగా అంచనావేసే వీలులేదని ఉగ్రవాద విశే్లషకుల అంచనా. వివిధ దేశాలకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలి.
అంతేకాకుండా ఉగ్రవాదుల్ని తరలించడానికి తవ్విన సొరంగాలు కాశ్మీర్ సరిహద్దులో బయటపడడం, ఫేస్‌బుక్ పరిచయాల పేరిట కొందరికి వలపన్ని భారత రక్షణదళాల కార్యకలాపాల్ని, కదలికల్ని శత్రు సైన్యం సేకరించడం, ఉగ్రవాద మూకల సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు, వారిపై ఉక్కుపాదం మోపి పీచమణిచేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నద్ధం కావాలి.

- దాసరి కృష్ణారెడ్డి