ఉగ్రవాదులకు టెర్రర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ కథానాయకుడుగా నటించిన టెర్రర్ చిత్రం స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతూ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తుందని దర్శకుడు సతీష్‌కాశెట్టి తెలిపారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ మస్తాన్ రూపొందించిన టెర్రర్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలిపారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల ముఠా సంచరిస్తోందన్న విషయం తెలుసుకున్న పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటన ఈ చిత్రంలో హైలెట్‌గా సాగుతుందని, ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బాంబుల గురించి ఎలా తెలుసుకున్నాడు? చివరికి ఎలా నిర్వీర్యం చేశాడు అన్న కథనంతో ప్రేక్షకులకు ఊహకు అందనంత వేగంగా సాగుతూ ఈ చిత్రం అబ్బురపరుస్తుందని ఆయన తెలిపారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ చిత్రంలో ప్రతి పాత్ర సరికొత్తగా ఉంటుందని, చిత్రంలో ఒక్కొక్క మలుపు తిరిగినప్పుడు ఆ పాత్రలు అలా ఎలా ప్రవర్తించాయని ప్రేక్షకుడే ప్రశ్నవేసుకుంటాడని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఈ చిత్రం సాగిందని ఆయన వివరించారు. వచ్చేనెల 4న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని, యూనిట్ అంతా ఇష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పక విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. నేపథ్య సంగీతం హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో కెమెరా పనితనం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు.