అంతర్జాతీయం

తుది ఘట్టానికి పర్యావరణ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒప్పందం ఖరారుకు నేటినుంచి మంత్రుల చర్చలు సానుకూల దృక్పథంతో చర్చలకు వెళ్తున్నాం: జావడేకర్

లీ బౌర్గెట్ (ఫ్రాన్స్), డిసెంబర్ 6: కర్బనపు ఉద్గారాలను పరిమితం చేయడానికి వీలుగా పరస్పర భిన్నమైన ప్రతిపాదనలున్న ముసాయిదాను ఒక పటిష్ఠమైన ఒప్పందంగా మార్చడానికి ఇక్కడ సమావేశమైన ప్రపంచ దేశాలకు చెందిన పర్యావరణ శాఖ మంత్రులంతా కూడా ఈ వారమంతా శ్రమించనున్నారు. కాగా, ఎన్నో అంచనాలున్న ఈ చర్చలకు సానుకూల దృక్పథంతో వెళ్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి మన దేశానికి చెందిన ప్రకాశ్ జావడేకర్‌సహా ప్రపంచ దేశాలకు చెందిన మంత్రులు జరిపే ప్రయత్నానికి 48 పేజీలుండే ముసాయిదా ఒప్పందం ప్రాతిపదిక కానుంది. సోమవారంనుంచి ప్రారంభమయ్యే మంత్రుల స్థాయి చర్చలతో 12 రోజుల పాటు ఇక్కడ జరిగే పర్యావరణ చర్చలు చివరి దశకు చేరుకుంటాయి. కాగా, వచ్చే వారం చివరికన్నా ముందే ఒక ఒప్పందానికి రాగలమని, దారుణంగా విఫలమైన 2009 నాటి కోపెన్‌హాగెన్ శిఖరాగ్ర సమావేశం పునరావృతం కాకుండా చూడగలమన్న గట్టి నమ్మకంతో చర్చలు జరుపుతున్న మంత్రులున్నారు. కాగా, పారిస్‌లో కుదరబోయే ఒప్పందం ఏదయినా భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్, అంతకన్నా తక్కువకు తగ్గించేదిగా మాత్రం ఉండకపోవచ్చని విశే్లషకులు అంటున్నారు.
భారతదేశ వైఖరి ఇంతకుముందు వ్యతిరేకించడంగా ఉండేదని, అయితే ఇప్పుడు మరింత చురుకైన పాత్రను పోషిస్తోందని, మనం ఇప్పుడు అనేక కొత్త ప్రతిపాదనలు చేసామని, వాటిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోందని ఈ కీలక చర్చల్లో పాలు పంచుకోవడం కోసం సోమవారం పారిస్‌కు చేరుకోనున్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు. పారిస్‌నుంచి వెలువడే తుది ఫలితంపై భారత్ ఎంతో ఆశావహంగా ఎదురు చూస్తోందని, మన దేశం సమస్యలో భాగం కానప్పటికీ సమస్యకు ఒక పరిష్కారం కుదిరేలా చేసే మధ్యవర్తిగా ఉంటుందని జావడేకర్ అన్నారు. ఇప్పుడు కావలసింది అభివృద్ధి చెందిన దేశాలు తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమని ఆయన అన్నారు. కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని చాలామంది అనుకుంటారని, అయితే అది వాస్తవం కాదని ఆయన అన్నారు. 29 శాతంతో చైనా మొదటిస్థానంలో ఉండగా, 16 శాతంతో అమెరికా రెండో స్థానంలో, 10 శాతంతో ఐరోపా మూడో స్థానంలో ఉన్నాయని, 5 శాతంతో భారత్ నాలుగోస్థానంలో ఉందని చెప్పారు. మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు కలిసి 56 శాతం ఉండగా, భారత్‌ది అయిదు శాతమేనని జావడేకర్ అన్నారు.