తెలంగాణ

కాంగ్రెస్ విజ్ఞప్తిని బాబుకు నివేదిస్తాం: టి.టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో పోటీ పెట్టరాదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తిని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ శుక్రవారం మీడియాకు తెలిపారు. పదవిలో ఉంటూ ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీ లేకుండా ఎన్నుకోవడమనే సంప్రాదాయాన్ని తెరాస పట్టించుకోవడం లేదన్నారు. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా మరణించినందున ఆయన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారని రమణ తెలిపారు. పాలేరులో తమ పార్టీకి కూడా పట్టు ఉందన్నారు. తెరాస అభ్యర్థిగా ఎంపికైన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిడిపిలో ఉండగా బాగా లబ్ధిపొందారన్నారు.