తెలంగాణ

టిఆర్‌ఎస్‌లో ‘ట్యాపింగ్’ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: అధికార టిఆర్‌ఎస్ పార్టీలో వాట్సఫ్ సందేశాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు టిఆర్‌ఎస్ నాయకుల మధ్య ఫోన్లో జరిగిన సంభాషణల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్‌ను ఒక మంత్రి అమ్ముకున్నట్టు నియోజకవర్గ ఇంచార్జి బాహాటంగా వ్యాఖ్యానించడం, పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష సర్పంచ్‌ను లోపల వేయిస్తానని హుంకరించిన ఫోన్ సంభాషణలు వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. పార్టీ పరువు మంటగలిపేలా ఉన్న ఈ ఫోన్ సంభాషణలు టిఆర్‌ఎస్ అధిష్టానం దృష్టికి రాగా వీటిని తెప్పించుకొని పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరించిన నాయకులను మందలించే దిశగా అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. వాట్సప్‌లో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్‌లో ఒకటి ఎల్‌బి నగర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ, హయత్‌నగర్ కార్పొరేటర్‌కు మధ్య జరిగిన సంభాషణ. హయత్‌నగర్‌లో పార్టీ తరఫున ముద్రించిన పోస్టర్‌లో తన ఫోటో ఎందుకు పెట్టలేదని నియోజకవర్గ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, హయత్‌నగర్ కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫోన్ ట్యాపింగ్ వాట్సప్‌లో వారం రోజులుగా కలకలం సృష్టిస్తుంది. ఈ ఫోన్ సంభాషణాల్లో ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి డబ్బులు ఇచ్చి కార్పొరేటర్ టిక్కెట్ తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు, నా వెంట సిఎం ఉన్నారు, రాజకీయంగా తొక్కేస్తాను’ అని కార్పొరేటర్‌ను నియోజకవర్గ ఇంచార్జి బెదిరించడం రికార్డు అయింది. రెండవ ఫోన్ ట్యాపింగ్‌లో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, దమ్మాయిగూడ సర్పంచ్ శంకర్‌గౌడ్‌ను బండబూతులు తిట్టడం రికార్డు అయింది.
‘నాపై పేపర్లో వచ్చిన వార్తను వాట్సప్‌లో పెడతావా, నీవు ఎమైనా తురుంఖాన్ అనుకుంటున్నావా? లోపల వేయిస్త బిడ్డ’ అంటూ పరమ బూతులు లంఘించుకున్నారు. ఒక ప్రజాప్రతినిధినన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఎమ్మెల్యే పరమ బూతులు తిట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వేర్వేరుగా రికార్డు చేసిన ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు పార్టీ పరువు తీసే విధంగా ఉండటంతో టిఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎల్‌బినగర్ నియోజకవర్గ ఇంచార్జి రామ్మోహన్‌గౌడ్‌కు, మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని వివరణ కోరుతూ షోకాజు నోటిసులు జారీ చేయాలని టిఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.