తెలంగాణ

పాలమూరు ఎత్తిపోతలతోనే వలసలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 5: పాలమూరు అంటేనే వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, బీడుబారిన పొలాలు, నీటి కష్టాలు గుర్తుకు వస్తుంటాయని, ఈ దారిద్య్రం పోవాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకంతోనే వీటన్నింటికీ బ్రేక్ పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిధిలోని మాదారం, గుడిగాంపల్లి, కంచన్‌పల్లి, మిడ్జిల్ గ్రామాల్లోని చెరువుల్లో మిషన్ కాకతీయ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.3 కోట్లతో చెరువుల్లోని పూడికతీత పనులకు శ్రీకారం చుట్టడంతో మంత్రి లక్ష్మారెడ్డి జెసిబి నడిపి చెరువుల్లోని ఒండ్రుమట్టిని వెలికితీశారు. మాదారం గ్రామంలో మంత్రి స్వయంగా చెరువులో ఒండ్రుమట్టిని తీసి తట్టలతో మోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా ప్రజలు నిరంతరం వలస కూలీలుగా మారారని, వారి బతుకుల గురించి ఆలోచిస్తే బాధేస్తుందని అన్నారు. వలస జీవుల బతుకులు మారాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే ప్రధాన జీవనాధారమని, ఈ పథకం పూర్తయితే వలసలకు బ్రేక్ పడుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయం చెప్పుకుంటూపోతే రోజుల తరబడి చెప్పుకోవచ్చని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొందరు దుర్మార్గులు అడ్డుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు.