తెలంగాణ

వైకాపా ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖాళీ అయపోయంది. తెలంగాణ భవన్‌లో బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో వైకాపా తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గం, వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు, ఆరు జిల్లాల అధ్యక్షులు తెరాసలో చేరారు. ఆంధ్ర నేతలు వారి ప్రయోజనాల కోసం పాకులాడుతుంటే తెలంగాణ సోయి ఉన్న నేతలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు తెరాసలో చేరారని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో సహా ఆ పార్టీకి చెందిన ఏడు జిల్లాల అధ్యక్షులు, 300 మంది స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరడం వందకు వంద శాతం సరైన నిర్ణయమని ముఖ్యమంత్రి అభినందించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు టిఆర్‌ఎస్‌లోకి రావడాన్ని చిల్లర, మల్లర రాజకీయంగా చూడవద్దు, వారి నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఏకీకరణగా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అప్పన్నంగా అధికారంలోకి రాలేదు, డబ్బులు ఖర్చు పెట్టి గెలువలేదు, ప్రజలు కట్టబెట్టిన అధికారం తమదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు పిడికెడు మందితో మొదలైన తమ ప్రస్తానం ఉప్పెనలా మారి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. పార్టీలో వెనుక, ముందు వచ్చిన వారందరు పాలు, నీళ్లలా కలిసిపోయి బంగారు తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో నిర్మించబోతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ కర్నూల్‌లో దీక్ష చేయనున్నట్టు చేసిన ప్రకటనకు తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. జగన్‌కు ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు ఎంత ముఖ్యమో, తమకు తెలంగాణ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాముడికి లక్ష్మణుడి మాదిరిగా, శ్రీకృష్ణుడికి అర్జునుని మాదిరిగా తోడు, నీడగా నిలబడుతానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు పన్నుతున్న కుట్రలను తిప్పి కొట్టడానికే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని అన్నారు.
chitram...
గులాబీ కండువా కప్పి తెరాసలో చేర్చుకున్న తరువాత అధ్యక్షుడు కెసిఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఖమ్మం ఎంపీ పొంగులేటి