తెలంగాణ

పూడికతీతలో బయల్పడిన తథాగతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, మే 3: క్రీస్తుశకం 2వ శతాబ్దానికి చెందిన నాలుగు గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామ పరిసర ప్రాంతంలోని రామసముద్రం చెరువులో బయటపడ్డాయి. ఉపాధికూలీలు చెరువులో పూడికతీత పనులు చేస్తుండగా నాలుగు రాతి విగ్రహాలు బయటపడటంతో తహశీల్దార్ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. వెంటనే చెరువు వద్దకు వెళ్ళిన తహశీల్దార్ విఆర్వోలు, విఆర్‌ఏల సాయంతో విగ్రహాలను బయటకు తీశారు. వెంటనే ఆర్కియాలజి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే వరంగల్ నుంచి నాగులవంచ చేరుకున్న ఆర్కియాలజి టెక్నికల్ అసిస్టెంట్ ఖాదిర్ విగ్రహాలను పరిశీలించారు. నాలుగు బుద్ధుడి విగ్రహాల్లో మూడడుగుల విగ్రహం ఒకటి, మూడు ఒక అడుగు విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను స్థానిక ఎస్‌ఐ జితేందర్ పర్యవేక్షణలో చింతకాని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. క్రీస్తుశకం 2వ శతాబ్దానికి చెందినవిగా ఆర్కియాలజి అధికారి గుర్తించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహం వలే విగ్రహాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాతితో చెక్కబడిన విగ్రహాలని ఆయన తెలిపారు. భూమిలో ఉండటం వల్ల చిన్న విగ్రహాల్లోని కొన్ని భాగాలు విరిగిపోయాయి. పెద్ద విగ్రహం స్పష్టంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న విగ్రహాన్ని తలపిస్తున్నదన్నారు. విగ్రహాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. విగ్రహాలను జాగ్రత్తగా భద్రపరచాలని తహశీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. చెరువులో బుద్ధుడి విగ్రహాలు దొరకడంతో వాటిని చూసేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడిశాల లక్ష్మినారాయణ, విఆర్వో మధు, ఆర్‌ఐ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.