తెలంగాణ

దాహంతో నీటి కోసం వచ్చి బావిలో పడ్డ చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, మే 3: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట-వెంకట్రావుపల్లి మధ్యలో ఆనంద రెడ్డి అనే రైతు వ్యవసాయబావిలో అటునుంచి సంచరిస్తున్న ఓ చిరుతపులి దాహం కోసం రాగా అందులో పడిపోయిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు తన బృందంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి చిరుతను తీయడం కష్టంగా ఉందని గమనించి వెంటనే వరంగల్ నుంచి రిస్క్యూ టీంను రప్పించారు. తదనంతరం రిస్క్యూ టీం సాయంత్రానికి చేరుకొని మత్తుమందు బుల్లెట్ చిరుతలోకి సూట్ చేశారు. రిస్క్యూ టీం క్రేన్ ద్వారా బావిలోకి దిగి చిరుతను పైకి తీసి బోనులో పెట్టారు. ప్రస్తుతం ఫారెస్ట్ ఆధ్వర్యంలో వైద్య చికిత్స పులికి చేయించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించనున్నట్లు ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ పేర్కొన్నారు. దాదాపు 4 గంటల సమయానికంటే ఎక్కువగానే పట్టింది. వీరికి స్థానిక నాయకులు సహకరించడంతో పులిని క్రేన్ ద్వారా బావిలో నుంచి బయటకు తీశారు.