తెలంగాణ

దమ్ముంటే రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: ఖమ్మం జిల్లా, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు గెలుపొందుతానన్న నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్ ఆవరణలోని ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మరణిస్తే వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకుందామంటే టిఆర్‌ఎస్ అంగీకరించలేదన్నారు. టిఆర్‌ఎస్‌కు మానవత్వం లేదని ఆయన అన్నారు. కాబట్టి ఆమెను గెలిపించి టిఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరాలని ఆయన సూచించారు.

మంగళవారం ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన టి.పిసిసి నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి