తెలంగాణ

పిడుగులు.. వడగళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వర్షం జనాన్ని అతలాకుతలం చేశాయి. పిడుగుపాటుకు వివిధ జిల్లాల్లో ఎనిమిది మంది మరణించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుత వేసవి సీజన్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత రామగుండంలో 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) ప్రకటించింది. దక్షిణ రాష్ట్రాల్లో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగుపాటుకు ఎనిమిది మంది మరణించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలాగే కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఆదిలాబాద్ జిల్లా పాపన్‌పేట గ్రామంలో పిడుగుపాటుకు మేకల కాపరి సుధాకర్ (23) మరణించాడు. కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ప్రశాంత్ (26), కాటారానికి చెందిన వీరబోయిన తిరుపతి (40) పిడుగుపాటుకు మరణించారు. మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన గాదె పాపయ్య (40), హుస్నాబాద్ మండలం అక్కనపేట గ్రామానికి చెందిన కాశబోయిన సమ్మయ్య (35) పిడుగుపాటుకు మరణించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గాండ్ల మల్లయ్య (65), కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామంలో బాలవికాస్ సంస్థకు చెందిన బత్తిని అఖిల్ (25) పిడుగుపాటుకు మరణించారు. అలాగే మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్‌లోసత్యాగౌడ్ (50) పిడుగుపాటుకు మరణించాడు.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఆవులు, ఎద్దులు, మేకలు కూడా చనిపోయాయి. ఇంద్రవెల్లి మండలం ఆర్కపురం గ్రామానికి చెందిన నలుగురు పిడుగుపాటుకు తీవ్రమైన గాయాలకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలకు మామిడి, వరి తదితర పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. నష్టం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం 44 డిగ్రీలు నమోదుకాగా, ఎపిలో అత్యధికంగా 44 డిగ్రీలు జంగమేశ్వరపురంలో నమోదైంది. ఇలా ఉండగా దక్షిణ తెలంగాణ, ఎపిలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా కురుపంలో 4 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లాలోని కొమరాడ, మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటలలో మూడేసి సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గూడురు, నల్లగొండ జిల్లా భువనగిరిలలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని పలుప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపారు. కర్నాటక, కేరళలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
ఇలా ఉండగా ఖమ్మం, కరీంనగర్, తూర్పుగోదావరితో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నాయని ఐఎండి ప్రకటించింది.
మరో వారం రోజుల పాటు ఒకవైపు చెదురుమదురుగా వర్షాలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరక్టర్ వైకె రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, సాంకేతిక కారణాల మూలంగా ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు.

chitram...
కరీంనగర్‌లో భారీ వర్షం