తెలంగాణ

మనమూ ఒక్కటవుదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: ఆంధ్రను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని సిఎం కె చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయని, వారి చర్యలను తిప్పి కొట్టేందుకు ఇక్కడి రాజకీయ పార్టీలు, నేతలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌కు చెంది న జెడ్పీటీసీలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో సిఎం సమక్షంలో తెరాసలో చేరారు. కెసిఆర్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాను శాశ్వతంగా కరవురహితం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఆంధ్ర పడ్డుపడేందుకు సిద్ధమవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రలో ఒకరు దీక్షకు దిగితే, మరొకరు ప్రాజెక్టుల నిలిపివేత కోరుతూ కేబినెట్‌లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతున్నారన్నారు. ఈ సమయంలో తెలంగాణలోని రాజకీయ పార్టీ లు, నాయకులు ఒక్కటై ప్రజలపక్షాన నిలబడాలన్నారు. ఆంధ్ర నేతల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తాను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని, అలాంటి జిల్లాలో వలసలను నియంత్రించి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కృషి చేస్తుంటే ఆంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో తాను పాలమూరు జిల్లాలో పర్యటించి అక్కడి పరిస్థితి చూసి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న జిల్లాలో కూడా కరవు తాండవించడం అత్యంత బాధాకరమన్నారు. కృష్ణా పక్కనేవున్నా పాలమూరు జిల్లా పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటమేంటని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి తీరుతామన్నారు. దీంతోపాటు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమ, కోయల్‌సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు జరుగుత్ను అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక రాష్ట్రం కోసం తాను పోరాటం చేస్తే నమ్మకం లేక చాలామంది కలిసిరాలేదని, అయినప్పటికీ తాను ఒక్కడినే పోరాడినని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం అప్పటి ఆంధ్ర పాలకులు జీవోలు ఇచ్చారు, శంకుస్థాపనలు చేశారు, కొబ్బరి కాయలు కొట్టారు, కానీ నీళ్లు మాత్రం రాలేదని సిఎం విమర్శించారు. వివిధ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తెరాసలో చేరిన కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు.
chitram...
మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులకు
పార్టీ కండువా కప్పి తెరాసలో చేర్చుకుంటున్న అధ్యక్షుడు కెసిఆర్