తెలంగాణ

మ్యాన్‌హోల్ మింగేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే1: ప్రపంచ కార్మిక దినోత్సవం ఇద్దరు కార్మికుల ఇళ్లల్లో విషాదం నింపింది. హైదరాబాద్ మహానగరంలో మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికులిద్దరికీ ఆక్సీజన్ అందక ఉక్కిరిబిక్కిరై దుర్మరణం పాలయ్యారు. ఆదివారం నగరంలోని రాంకోఠిలో గల కపాడియా లైన్స్, ఎఎస్ లైన్స్‌లోని ఓ మ్యాన్‌హోల్ వద్దకు ఆదివారం ఉదయం గం. 10.30లకు ఇద్దరు కార్మికులు వచ్చారు. ముందుగా ఒకరు మ్యాన్ హోల్ తెరచి లోనికి దిగారు. సీవరేజ్ లైన్‌ను శభ్రపరుస్తుండగా అతనికి ఊపిరాడలేదు. అతను ఉక్కిరిబిక్కిరవుతుండటంతో అతణ్ణి కాపాడేందుకు వెంట వచ్చిన మరో కార్మికుడు మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. ఇద్దరు కూడా ఊపిరాడక కేకలు వేయడంతో మ్యాన్‌హోల్ పక్క నుంచే కాలి నడకన పోతున్న ఓ వ్యక్తి గమనించాడు. స్థానికులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. వీరిని మ్యాన్ హోల్ నుంచి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మృతులు వీరస్వామి, కోటయ్యగా గుర్తించారు. వీరస్వామి ముందుగా మ్యాన్‌హోల్‌లోకి దిగి పైపులైన్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అందులోనే ఉండిపోయాడు. కోటయ్య వీరస్వామిని కాపాడే ప్రయత్నంలో మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను కూడా ఊపిరాడక కుప్పకూలిపోయాడని సుల్తాన్ బజార్ సర్కిల్ ఇనె్స్పక్టర్ శివశంకర్ తెలిపారు. విచిత్రమేమంటే వీరిని ఏ శాఖకు చెందిన అధికారులు పనిలోకి పంపారన్న దానిపై స్పష్టత రాలేదు. మేడే సెలవు దినమైనప్పటికీ వీరిని పని చేయాలంటూ ఎవరు ఆదేశించారన్నది తేలలేదు. మొత్తంమీద అధికారుల ఆదేశం మేరకే వారు మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లారనేది స్పష్టం. అయితే వారెవరన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు. కోటయ్య, వీరస్వామిలను అడ్డా కూలీలుగా గుర్తించారు. వీరిని ఏ శాఖకు చెందిన అధికారులు మ్యాన్‌హోల్‌లోకి దించుతారు, అది కూడా (మేడే) సెలవురోజున వీరిని ఏ అధికారి ఆదేశించారు.. అనే కోణం నుంచి దర్యాప్తు జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని జలమండలి, సీవరేజ్ బోర్డు అధికారులను విచారిస్తామని, వీరిని సెలవుదినం రోజున పనిలోకి ఎవరు తీసుకున్నారో గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సిఐ వివరించారు. ఇదిలావుండగా మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక మృతి చెందిన ఇద్దరు కార్మికులపై జల మండలికి చెందిన వారు కాని, సీవరేజ్ బోర్డుకు చెందిన అధికారులు కానీ స్పందించలేదు.

మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న మున్సిపల్ సిబ్బంది