తెలంగాణ

కనీసం రూ.10 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకుపైగా ఉండేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు కార్మిక, ఉపాధి కల్పన మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లు ఏమిటో తమ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తెలుసన్నారు. కార్మికులు ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేకుండానే సమస్యలు పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కార్మిక సమ్మెలు, ఆందోళనలు కనిపించడం లేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన మేడే ఉత్సవాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వెట్టిచాకిరి అనేదే లేకుండా చేయాలని సిఎం కంకణం కట్టుకున్నారని, తక్కువ వేతనంతో ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారందరి సర్వీసులను తమ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందని మంత్రి నాయిని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్ల కార్మికులకు తగినంత పని దొరుకుతుందని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలనెలా వేతనం అందుకుంటున్నారని అన్నారు. కార్మిక చట్టాలను తప్పనిసరిగా అమలు చేస్తూ కార్మిక హక్కులు కాపాడుతున్నట్టు చెప్పారు. యజమాన్యాలు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుచేసే వారు ఏస్థాయిలో ఉన్నా తమ సిఎం ఉపేక్షించరని హెచ్చరించారు. ఇలాఉండగా కార్మిక చట్టాలను, సంక్షేమాన్ని చక్కగా అమలు చేయడంతోపాటు మంచి ఉత్పత్తి సాధించిన కంపెనీల ప్రతినిధులను మంత్రి సత్కరించారు. రెడ్డి ల్యాబ్స్, మహీంద్రా ఆటో డివిజన్, ఎంఆర్‌ఎఫ్, సింగరేణి కాలరీస్, పెన్నా సిమెంట్ తదితర యాజమాన్యాలకు ప్రశంసా పత్రాలు అందించారు.
ఉద్యమంలో కార్మిక పాత్ర ఎనలేనిది: కవిత
కార్మికులు కేవలం తమ హక్కుల కోసమే కాకుండా పరాయి పాలనలో మగ్గుతున్న తెలంగాణను దోపిడినుంచి విముక్తి కల్పించి ప్రత్యేక రాష్ట్ర సాధనకుజరిగిన ఉద్యమంలో కార్మికుల పాత్ర ఎనలేనిదని కరీంనగర్ ఎంపీ కె కవిత అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మేడే ఉత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను తెరాస ప్రభుత్వం తీర్చిందన్నారు. సింగరేణి కాలరీస్ కార్మిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ఆమె గుర్తు చేశారు. తెరాస ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికుల పక్షపాతి అని కవిత అన్నారు. కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా శ్రమ దోపిడికి గురైతే తమ ప్రభుత్వం వచ్చాకే వారి సమస్య పరిష్కారమైందని కవిత అన్నారు.

మేడే ఉత్సవాల్లో మాట్లాడుతున్న నాయిని