తెలంగాణ

సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకరణ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకరణలతో శుక్రవారం సందడి నెలకొంది. మంత్రుల శాఖలలో ఇటీవల జరిగిన చేర్పులు, మార్పుల మేరకు కొత్తగా అప్పగించిన శాఖల బాధ్యతలను మంత్రులు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సహకారశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు. అలాగే మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా దేవులపల్లి ప్రభాకర్‌రావు, నాగార్జునసాగర్ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు సచివాలయం డి బ్లాక్‌లో తమకు కేటాయించి చాంబర్‌లలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలకు ఇతర మంత్రులు హాజరై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.