తెలంగాణ

గులాబీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ -- టార్గెట్ 2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎర్రకోటగా పేరుబడిన ఖమ్మం జిల్లా తొలిసారి పూర్తిగా గులాబీమయమైంది. జిల్లాలో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభ, ప్లీనరీ విజయవంతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపా ఏ పార్టీ అధికారంలో ఉన్న వారి అధికార హద్దులు ఖమ్మం సరిహద్దు వరకే. ఖమ్మం మాత్రం వామపక్షాలకు శత్రు దుర్బేద్యంగానే నిలిచేది. అయతే, తెలంగాణ ఆవిర్భావం తరువాత, తెరాస అధికారంలోకి వచ్చాక ఎర్రకోట కాస్తా గులాబీగా మారుతోంది. ఈ పరిణామం ఎంతబలంగా, ఎంత వేగంగా సాగుతోందో ఖమ్మంలో జరిగిన తెరాస ప్లీనరీ మొత్తం రాష్ట్రానికి చాటి చెప్పింది. ఎండాకాలం కావడంతో స్థానికంగానే జన సమీకరణ జరిపి బహిరంగ సభను విజయవంతం చేశారు. ‘ఉద్యమ కాలంలో జిల్లాలో తెరాస తరఫున ప్రచారానికి వస్తే, ఖమ్మంలో తెరాస ఏంటి? మీ సమయం వృధా చేసుకుంటున్నారు వెళ్లండంటూ చిన్నచూపు చూశారు. అలాంటి ఖమ్మంలో ఇప్పుడు ఎటు చూసినా గులాబీ గాలి వీస్తుండటం సంతోషంగా ఉంది’. ప్లీనరీలో ఇదీ తెలంగాణ వాదుల ఆనందం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉద్యమ కాలంలోనే తెరాస బలపడగా, ఖమ్మంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎన్నికల తరువాత బలోపేతమవుతోంది. నాయకులు పార్టీలో చేరడమే కాదు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు సైతం మీ వైపేనని తెరాసను గెలిపించారు. ప్లీనరీ తరువాత పాలేరు ఎన్నికల్లో సైతం గులాబీ ఘన విజయం సాధించడం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది. ప్లీనరీలో సిఎం కెసిఆర్ ప్రారంభోపన్యాసం, ముగింపు, బహిరంగ సభలోనూ చెప్పినవన్నీ వచ్చే ఎన్నికల నాటికి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ఎంతో సాధించాం. మూడేళ్లలో మిగిలినవి పూర్తి చేసి చూపిద్దాం. ప్రజలు ఇప్పటిలానే మనవైపే ఉంటారంటూ పార్టీ శ్రేణులకు కెసిఆర్ ఆత్మవిశ్వాసం కలిగించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, కోటి ఎకరాలకు సాగు నీరు, డబుల్ బెడ్‌రూమ్ వంటి ప్రధానమైన హామీలన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు ఆదరిస్తున్నంత బలంగానే, మాట తప్పతే బండకేసి కొడతారనే విషయం మరిచిపోవద్దని పార్టీ యంత్రాంగానికి హితవు పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్లీనరీ, సాయంత్రం బహిరంగ సభ ఒకే రోజుతో ముగించారు. గతంలో కెసిఆర్ బహిరంగ సభలో తానొక్కరే ప్రసంగించే వారు. దీనికి భిన్నంగా ఖమ్మం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసగించారు. జిల్లా ప్రజల మనసు దోచుకునేలా సిఎం కెసిఆర్ ప్లీనరీకి ఒకరోజు ముందే ఖమ్మంలో ఒక బాలిక ఇంటికి అతిథిగా వెళ్లారు.
ఉప ఎన్నికల్లో తెరాసకు ప్లీనరీ కలిసొచ్చింది. పారేరు నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే ఖమ్మం జిల్లాలో తెరాస ప్లీనరీ ఖరారైంది. ఖమ్మంలో ప్లీనరీ నిర్వహించవద్దని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ప్లీనరీతో ఖమ్మంలో వాతావరణం గులాబీమయంగా మారడం ఉప ఎన్నికల్లో తెరాసకు కలిసొచ్చే అంశమైంది.