తెలంగాణ

ప్రజలే మా బాస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల అజెండానే మా అజెండా. మాకు ఎవరూ బాసులు లేరు. ప్రజలే మా బాసులు. వారే మా అజెండా..
హైకమాండూ వాళ్లే.

ఖమ్మం, ఏప్రిల్ 27: ఈ వయసులో నాకేం ప్రత్యేకమైన కోరికలు లేవు. తెలంగాణ సాధించుకున్నాం. ఇక ఆకుపచ్చ తెలంగాణను కళ్లారా చూడాలన్నదే అంతిమ కోరిక అని సిఎం కె చంద్రశేఖర్‌రావు తన కోరికను వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఖ్యాతి తనకుందని అంటూనే, దానిముందు ముఖ్యమంత్రి పదవి తన దృష్టిలో పెద్దదేం కాదన్నారు. కలలు కనడానికి సాహసం కావాలి (డేర్ టు డ్రీమ్). వాటిని సాకారం చేసుకోవడానకి అంకుఠిత దీక్ష, పట్టుదల ఉండాలి. అది తనకుందని సిఎం కెసిఆర్ అన్నారు. ఏన్నో ఏళ్ళ పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలంతా సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెరాస 15వ ప్లీనరీని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎంతసేపు ఓట్లు.. రాజకీయాలు కాదు, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే మానవీయకోణం ఉండాలని అన్నారు. ‘ప్రజల ఏజెండానే మా ఏజెండా. మాకు ఎవరూ బాసులు లేరు. ప్రజలే మా బాసులు. వారే మా ఏజెండా.. మా హైకమాండ్’ అని ముఖ్యమంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రతీ అంశంలో మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసి పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఎందుకైతే కలలు కన్నారో వారి కలలను సాకారం చేసే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్టులకు పునరాకృతినిచ్చి కోటి ఎకరాలకు సాగునీరు అందించే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ దేశంలో మరే రాజకీయ పార్టీ చేయలేని సాహోసేపేత నిర్ణయాన్ని తీసుకున్నాం. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడిగేది లేదన్నారు. హామీ నెరవేర్చకపోతే ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని ఇంతమంది రాజకీయ నేతల జీవితాలను ఫణంగాపెట్టి ప్రకటించగలిగే సాహసులు ఎవరైనా ఉన్నారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రకటించిన దానికంటే ముందుగానే ఈ డిసెంబర్ నాటికి 6400 గ్రామాలకు మంచినీరు ఇవ్వడమే కాకుండా, వచ్చే ఏడాది డిసెంబర్ వరకల్లా దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ మంచినీరు అందించబోతున్నామని హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలందరికీ కెజి టు పిజీ వరకు ఉచిత విద్యను అందించేదాకా కెసిఆర్ నిద్రపోడని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2019నాటికి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి తీరుతామన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబట్టేందుకు డబుల్ బెడరూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ ఏడాది 2 లక్షల 60 వేల ఇళ్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడానికి ఇంకా నాలుగేళ్లు వ్యవధి ఉన్నప్పటికీ ఆయన్ను ఒక ప్రజా ప్రతినిధిగా చేసేందుకు పాలేరు ఎన్నికల బరిలోకి దిగాలని కోరింది తానేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలిసొచ్చే అదృష్టానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా ఖమ్మం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి పర్చడానికి పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలకు అద్భుత విజయాన్ని అందించాలని సిఎం పిలుపునిచ్చారు.
chitram..
ఖమ్మంలో తెరాస ప్లీనరీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం. బహిరంగ సభ వేదికపై గిరిజనుల సాంప్రదాయ తలపాగాతో సిఎం కెసిఆర్‌ను సత్కరిస్తున్న తెరాస నేతలు