తెలంగాణ

‘రాజకీయ పునరేకీకరణ అంటే ఫిరాయింపులేనా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆదర్శంగా ఉంటాయనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కారణంగా అనైతికంగా మారుతున్నాయని టి.పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం. కోదండరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి జి. నిరంజన్‌లు విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ అంటే ఫిరాయింపులేనా? అని వారు సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామని చేరిన వారు ప్రకటించడం అనైతికమని వారు విమర్శించారు. అలాగైతే కేంద్రంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలే ఉండవని వారన్నారు.