తెలంగాణ

కోర్టు ధిక్కారం కేసులో రంగారెడ్డి కలెక్టర్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: మూడు కోర్టు ధిక్కార కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ముగ్గురు అధికారులకు జరిమానా విధించారు. ఐఎఎస్‌లకు ముస్సోరిలో శిక్షణ ఇస్తున్న సమయంలో న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాలని సంవేద్యీకరణ చేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్‌కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఐదు వేల రూపాయిల జరిమానా విధించారు. దానిని చెల్లించని పక్షంలో కమిషనర్‌కు ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష వేశారు. గుడిమల్కాపూర్ మార్కెట్ యార్డులో వెజిటబుల్ కమిషనర్ ఏజంట్ల దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవల్సిందిగా మూడు నెలల క్రితం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్ధేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇంకో కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌కు న్యాయస్థానం 1116 రూపాయిలు జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పోచారం గ్రామంలో రహదారి నిరోధకాలను తొలగించనందుకు న్యాయమూర్తి ఈ జరిమానా విధించారు. కలెక్టర్ ఈ జరిమానాను చెల్లించని పక్షంలో రెండు రోజుల జైలు శిక్ష అనుభవించాలని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు సైతం హైకోర్టు 1116 రూపాయిల జరిమానా విధించింది. ధిక్కార కేసుల్లో చాలా అరుదుగా మాత్రమే న్యాయస్థానం జరిమానాలు విధిస్తుందని, అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉద్ధేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదని చాలా స్పష్టంగా తేలినపుడు ధిక్కార కేసుల్లో జరిమానాలు తప్పవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఆదేశాల కాపీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పంపించాలని, అలాగే ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్ర్తీ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు సైతం సమాచారం ఇవ్వాలని అక్కడ శిక్షణలో భాగంగా ట్రైనీలకు సంవేద్యీకరణ జరగాలని సూచించారు.