తెలంగాణ

కెసిఆర్ బస్సు యాత్రకు బ్రేకులేసిన ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: కెసిఆర్ బస్సు యాత్రకు ఎండలు బ్రేకు వేశాయి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే బస్సు యాత్ర చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించినప్పటికీ, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి భద్రాచలం శ్రీసీతారామ కళ్యాణానికి వెళ్లిప్పుడు ఎండల వల్ల అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే మూడు రోజుల పాటు అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఎండాకాలం తరువాతే బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పార్టీ సమావేశాలు నిర్వహించాలని తొలుత భావించారు. బస్సు యాత్రను వాయిదా వేసుకున్నందున ఇప్పుడు ప్లీనరీ తరువాత జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నందున వాటి నిర్మాణాలను స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం మొదటి దశ అమలులోకి వచ్చిన సమయంలో ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని ఇవ్వకపోతే ఓట్లు అడగను అని ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే ప్రకటించారు. అనుకున్న విధంగానే ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. తొలి దశలో మరో నెల రోజుల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో మంచినీటిని అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.