తెలంగాణ

ఎండదెబ్బకు పాల ఉత్పత్తి ఢమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 25: గత కొన్ని వారాలుగా దంచికొడుతున్న ఎండల దెబ్బకు కరీంనగర్ జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోయింది. సుమారు లక్ష లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఓ వైపు ఎండ ప్రచండంతో పాడి పశువులు విలవిల్లాడుతూ ఒత్తిడికి గురవుతుండడం, మరోవైపు నీరు, పశుగ్రాసం కొరత వెరసి పాలఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితులు మరో రెండు మాసాలు ఉండే పరిస్థితులుండే సూచనలు కనబడుతుండడంతో పాడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పెద్దవి, చిన్నవి కలిపి మొత్తం పదహారు పాల కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని ముల్కనూర్ మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ, తిమ్మాపూర్‌లోని ప్రియా మిల్క్‌తోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో మరో పదమూడు చిన్న పాలఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 7.71 లక్షల ఆవులు, గేదెలు, దూడలు ఉండగా, ఇందులో 3.50 లక్షలు పాలిచ్చే ఆవులు, గెదెలు ఉండగా, అయితే, ఇందులో సమృద్ధిగా పాలిచ్చే ఆవులు, గెదెలు 2.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా 3.50 లక్షల పాలఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఉత్పత్తి అయిన పాల క్రయవిక్రయాలు ఈ పదహారు పాల కేంద్రాల ద్వారా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, మెదక్, వరంగల్ తదితర జిల్లాలకు జిల్లా నుంచి పాలు సరఫరా అవుతున్నాయి. జిల్లాలో ఈ పాడి పరిశ్రమపై సుమారు 1.50 లక్షల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, గతకొన్ని వారాలుగా దంచికొడుతున్న ఎండలకు ఆ ఉత్పత్తి ఏకంగా 2.50 (29శాతం) లక్షలకు తగ్గిపోయింది.
ఈ క్రమంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ఓ వైపు జిల్లాలో కరవు కరాళ నృత్యం చేస్తుంటే..ఎంతోకొంత తమకు ఆధారంగా ఉన్న పాడి పరిశ్రమ ఎండ దెబ్బకు కుదేలవుతోందని పాడి రైతులు దీంతో పాడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, పాల ఉత్పత్తుల విక్రయాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఎండ దెబ్బకు గతేడాది ప్రతిరోజు 7 వేల లీటర్ల పెరుగు అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది ఎండ వేడికి అది 30 వేల లీటర్లకు పెరిగింది. గతేడాది ప్రతిరోజు 30 వేల మజ్జిగ పాకెట్లు అమ్మగా, ఈ సారి 50 వేల పాకెట్లు అమ్ముడుపోతున్నాయి. గతేడాది జిరో అమ్మకాలు ఉన్న లస్సీ 3 వేల గ్లాసుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఎండ ప్రచండానికి అటు జనం, ఇటు పశువులు అల్లాడిపోతుండగా, వర్షాలు త్వరగా పడితే బాగుండు దేవుడా అంటూ ప్రజలు మొక్కుకుంటున్నారు.