తెలంగాణ

ఫ్ల్లెక్సీపై సిఎం ఫొటో లేకపోవడంపై జిఎంఆర్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్ట్‌టాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జిఎంఆర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రారంభోత్సవ సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మ మాత్రమే ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ ఫొటో పెట్టకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన అధికారులను నిలదీశారు. ముఖ్యమంత్రి అంటే మీకు గౌరవం లేదా అని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రిని గౌరవించనప్పుడు తామెందుకు రావాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిఎంఆర్ అధికారుల వైఖరి సక్రమంగా లేదని ఆరోపించారు. దీంతో పొరపాటు జరిగిందని అధికారులు ఒప్పుకున్నారు. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ పోస్టర్ తెప్పించి ఫ్ల్లెక్సీకి అంటించారు. దీంతో ఎమ్మెల్యే సంతృప్తి చెందారు. జాతీయ రహదారి విస్తరణ పనులు సంతృప్తికరంగా లేవన్నారు. చౌటుప్పల్‌లో సర్వీస్ రోడ్లు నేటికీ పూర్తి చేయలేదన్నారు. నిర్వహణ కూడా సక్రమంగా లేదని మండిపడ్డారు. సర్వీస్ రోడ్లు వెంటనే పూర్తి చేయాలని, నిర్వహణ సక్రమంగా ఉండాలని ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.