తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు ఆరు లక్షల సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: అమెరికాలోని సాన్ జువాన్ ప్యూర్టోరికా నగరంలో మే 18 నుంచి 22 వరకు జరిగే స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంపిటేషన్‌లో పాల్గొనే ముగ్గురు తెలంగాణ విద్యార్థులకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు చెందిన స్టెల్లా కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన డి మాధవి, అదిలాబాద్‌కు చెందిన వి సాయి సౌమ్యలు కడప జిల్లా ఇడుపుల పాయలో చదువుతున్నారు. వాష్టింగ్టన్‌కు చెందిన స్పెస్ సొసైటీ వీరిని కాంపిటేషన్‌లో పాల్గొనడానికి ఆహ్వానించింది. అమెరికా వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులను భరించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసి రెండేసి లక్షల రూపాయల చొప్పున సహాయం అందించారు.