తెలంగాణ

కలప అక్రమ రవాణాపై హైదరాబాద్ నాకా బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ నగరం మీదుగా కలప అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడానికి నాకాబందీ నిర్వహించాలని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధికారులను ఆదేశించారు. హరిత హారంపై మంత్రి అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాల్లో పలు రకాల కలప చేరుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాకాబందీ నిర్వహించడంతో పాటు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. హరిత హారంపై అధికారులు నిర్లక్ష్య వైఖరిని సహించేది లేదని అన్నారు. అరణ్య భవన్‌లో శనివారం హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల అటవీ ఉన్నతాధికారులతో హరిత హారంతో పాటు పలు అంశాలపై సమీక్ష జరిపారు. జూలై మొదటి వారంలో హరిత హారం కింద ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి హరిత కమిటీలతో చర్చించి ప్రజలు కోరుకుంటున్న పలు రకాల మొక్కలను సిద్ధం చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడక నడుస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిత కమిటీలతో సంప్రదించి ప్రజలు కోరుకుంటున్న మొక్కలను అందజేసేందుకు తక్షణం రంగంలోకి దిగాలని మంత్రి ఆదేశించారు. అధికారులు నిర్లిప్తత విడనాడి హరిత హారం ఒక్కటే ప్రస్తుతం ప్రాధాన్యత అంశమని చెప్పారు. అధికారుల పనితీరు సమీక్షించేందుకు త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్టు చెప్పారు. సమీక్షా సమావేశంలో అటవీ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, పిసిసిఎఫ్ పరేశ్‌కుమార్ శర్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.